Drugs Party In Hyderabad: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగిల్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. 9 పబ్స్ పైన ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. ఇప్పటికే, పబ్బుల యజమానులకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం తమ ఎదుట హాజరు కావాలని పబ్బు యజమానులకు నోటీసులు అందజేశారు. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. మూడు పబ్స్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించారు. అయితే, పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్స్ కు చెందిన యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
Read Also: Kothapalli Lo Okappudu: ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ రిలీజ్..
అయితే, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ రాజా శేఖర, కోరా పబ్ పృద్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు సూర్య పేర్కొన్నారు.