Godavari Floods: గోదావరి ఉగ్రరూపంతో అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో వరద భయం నెలకొంది. కూనవరం, శబరి - గోదావరి సంగమం వద్ద నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. ఇళ్లల్లోని సామగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
AP Govt: ఫీజు రియంబర్స్ మెంట్ కోసం 600 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేశామని ఉన్నత విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
Gudivada Tension: కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలతో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నాగవారప్పాడు జంక్షన్ నుంచి K కన్వెన్షన్ సెంటర్ వైపు వైసీపీ కార్యకర్తలు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు ఆడుకుంటున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రి పేర్నినాని సహా ముఖ్య నాయకులను మచిలీపట్నంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలోని K కన్వెన్షన్ లో వైసీపీ బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి భారీగా వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక, అనారోగ్య కారణాల వల్ల ఈ మీటింగ్ కు దూమాజీ మంత్రి కొడాలి నాని, ఆయన అనుచరులు దూరంగా ఉన్నారు.
Dharmana Prasada Rao: చంద్రబాబు మ్యానిఫేస్టో అమలు చేయడని మన అందరికి తెలుసు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఆ విషయం కార్యకర్తలు ప్రజలకు చెప్పాలి.. ప్రతిపక్షంలో ఉన్నవారు.. ప్రజలకు లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నించాలి..
High tension in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరగనుంది. ఈ సభకు మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
Ambati Rambabu: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కూటమి ఏడాది పాలన సుపరిపాలన కాదు.. మోసపు పరిపాలన.
Anil Kumble: ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు టీమిండియా తరపున ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి హీరో అనడంలో ఎలాంటి సందేహమే లేదని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసించారు.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 నిర్వహణ పైనా అనిశ్చితి నెలకొంది. ఈ నెల (జూలై) చివరి వారంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ మీటింగ్ కు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా మారింది. అయితే, ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా అయింది. ఇక్కడ జరగబోయే ఏసీసీ మీటింగ్కు తాము హాజరుకావడం లేదని ఇప్పటికే భారత్, శ్రీలంక దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు సమాచారం ఇచ్చాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి
Congress: కేరళ రాష్ట్రంలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన వైపే మొగ్గు చూపుతున్నారనే సర్వే బయటకు వచ్చిందంటూ లోక్సభ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. మొదట ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది.