Sanju Samson: కేకేఆర్లోకి సంజూ శాంసన్.. హింట్ ఇచ్చిన స్కౌటింగ్ హెడ్!
- సంజూ శాంసన్ వచ్చే సీజన్‌లో కేకేఆర్ లోకి వెళ్తున్నట్లు నెట్టింట ప్రచారం..
- ఈ ప్రచారానికి హింట్ ఇచ్చిన కేకేఆర్ స్కౌటింగ్ హెడ్ బిజూ జార్జ్..
- సంజూ శాంసన్ జట్టు మారతాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: ఐపీఎల్ 2025 సీజన్ ముగిసి కొన్ని రోజులే అవుతుంది. ఇక, తదుపరి సీజన్‌పై చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఉన్న సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ విండో ఆప్షన్ ద్వారా తీసుకుంటుందనే ప్రచారం జోరుగా కొనసాగింది. అయితే, ఈ అంశంపై అటు సంజూ కానీ, ఇరు ఫ్రాంచైజీలు కానీ ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు. అయినా సంజూ సీఎస్‌కేలో చేరతాడనే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అయింది. మరవైపు, సంజూకు సంబంధించి మరో ప్రచారం తాజాగా మొదలైంది. వచ్చే సీజన్‌లో కేకేఆర్‌కు శాంసన్ ఆడబోతున్నాడని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రచారానికి కేకేఆర్ స్కౌటింగ్ హెడ్ బిజూ జార్జ్ హింట్ ఇచ్చాడు. తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్లో చేసిన ఓ పోస్ట్‌లో సంజూతో చాలాకాలం క్రితం కలిసి దిగిన ఫోటో దర్శనమిస్తుంది. ఈ ఫోటోకు బిజూ కొన్ని జ్ఞాపకాలు ప్రత్యేకమైనవిగా ఉండిపోతాయని క్యాప్షన్ ఇచ్చాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్‌కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
ఇక, కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) స్కౌటింగ్ హెడ్ బిజు జార్జ్ పోస్టును చూసి నెటిజన్లు సంజూ శాంసన్ కోసం కేకేఆర్ ప్లాన్ సిద్ధం చేస్తుందనే ప్రచారం మొదలు పెట్టారు. వాస్తవానికి కేకేఆర్‌కు వచ్చే సీజన్ కోసం వికెట్ కీపర్‌తో పాటు కెప్టెన్ కావాల్సి ఉంది. సంజూ శాంసన్ ఈ రెండు పాత్రలకు తగిన న్యాయం చేస్తాడని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం అనుకుంటుందని టాక్. గత సీజన్‌లో కేకేఆర్ అజింక్య రహానే కెప్టెన్సీలో పాయింట్ల పట్టికలో వెనకబడి పోయింది.
Read Also: Minister Nara Lokesh: పవన్ కల్యాణ్ సవాల్‌ను స్వీకరించిన లోకేష్.. నేను రెడీ..!
దీంతో సంజూ శాంసన్ లాంటి కెప్టెన్ తమ జట్టులోకి వస్తే జట్టు కష్టాలు తీరుస్తాడని కేకేఆర్ అనుకోవడంలో ఎలాంటి తప్పులేదు. అయితే, ఎలాగూ ట్రేడింగ్ విండో ఆప్షన్ ఉండటంతో.. అతడి కోసం కేకేఆర్ ఎంత డబ్బైనా పెట్టే అవకాశం ఉంది. ఏం జరుగుందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. ఇక, సంజూ శాంసన్ 2013లో రాజస్థాన్ రాయల్స్‌తో తన జర్నీని స్టార్ట్ చేశాడు. అతి కొద్ది కాలంలో ఆ జట్టులో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ సస్పెండ్‌తో శాంసన్ ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు వెళ్లి.. 2018లో అతడు తిరిగి రాయల్స్ గూటికి చేరుకున్నాడు. అలాగే, 2021 సీజన్‌లో శాంసన్ రాజస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతని సారథ్యంలో 2022 సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. తాజాగా ముగిసిన సీజన్‌లో శాంసన్ గాయంతో పెద్దగా టోర్నోలో కనిపించలేదు. అతని ప్లేస్ లో రియాన్ పరాగ్ ఎక్కువ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేశాడు.
తాజావార్తలు
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!