Brazil- Trump Tariff War: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పట్ల ఆ దేశం అవమానిస్తున్న తీరుకు అక్కడి ఎగుమతులపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక, ట్రంప్ ప్రకటన తర్వాత కొద్దిసేపటికే బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు. అందులో సుంకాలను ఏకపక్షంగా పెంచే ఏ చర్యకైనా బ్రెజిల్ ఆర్థిక చట్టం ప్రకారం ప్రతిస్పందించబడుతుంది అని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలో యూఎస్ వస్తువులపై బ్రెజిలియన్ సుంకాలు విధించవచ్చని సంకేతాలు ఇచ్చింది. అలాగే, బ్రెజిల్ యొక్క స్వేచ్ఛా పూరిత ఎన్నికలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై అమెరికన్లు కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని లూయిజ్ ఇన్సియో ఆరోపించారు.
Read Also: Illegal Affair Murder: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు.. తల్లి అరెస్ట్..!
అయితే, బ్రెజిల్ స్వయం పాలన హక్కును రెట్టింపు చేశారు.. బ్రెజిల్ స్వతంత్ర సంస్థలు కలిగిన సార్వభౌమ దేశం, ఎటువంటి బెదిరింపులకు భయపడదని అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వా తేల్చి చెప్పారు. అంతేకాకుండా, బోల్సోనారోపై చట్టపరమైన చర్యలు పూర్తిగా దేశీయ విషయమని నొక్కి చెప్పారు. తిరుగుబాటుకు ప్రణాళిక వేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బ్రెజిల్ న్యాయ శాఖ చూసుకుంటుందన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే బెదిరింపులు లేదా ఒత్తిళ్లు దేశ న్యాయస్థానాలను ప్రభావితం చేయవని హెచ్చరించారు. అలాగే, దేశ విదేశీ కంపెనీలు మన భూభాగంలో పని చేయడానికి బ్రెజిలియన్ చట్టాన్ని పాటించాలి అని అధ్యక్షుడు సూచించారు. కొత్త సుంకాలు వాణిజ్య అసమతుల్యత ద్వారా సమర్థించబడుతున్నాయనే ట్రంప్ వాదనను అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వా తోసిపుచ్చారు.