Ayodhya Ram Mandir Scam: విశాఖపట్నంలో అయోధ్య రామ్ నమూనా మందిరం వివాదం కేసులో బిగ్ ట్విస్ట్. ఒక్కోక్కటిగా నిర్వాహకుల అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి పేరుతో వ్యాపారమే లక్ష్యంగా నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ రెచ్చిపోయాడు. దేవుడి పేరుతో బిజినెస్ చేసేందుకు అమాయకులకు ఎరా వేసినట్లు గుర్తించారు.
Investopia Global-AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టోపియా గ్లోబల్- ఏపీ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సు విజయవాడలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
MLA Kolikapudi: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హంగామా సృష్టించాడు. ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది.
Anil Kumar Yadav Mining Case: నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై మైనింగ్ కేసు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆయన ముఖ్య అనుచరుడిగా ఉన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
CPI Ramakrishna: సీపీఐ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టీడీపీ, వైసీపీ పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు. ఆదాని పవర్స్ తో 17 వందల కోట్ల రూపాయల లంచం తీసుకుని వైసీపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక, టీడీపీ అధికారంలోకి వచ్చాక యూజర్ చార్జీల పేరుతో మరో రూ. 15 వందల కోట్లు ప్రజలపై భారం వేసింది అని ఆరోపించారు.
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో అవసరమైన కొన్ని సదుపాయాలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Minister Anagani: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు వైసీపీ నేతల మతిభ్రమించి మాట్లాడుతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. కొందరు చరిత్ర హీనులు ఉంటారు.. వారి గురించి మాట్లాడి నా స్థాయిని దిగజర్చుకోలేను అని సెటైర్ వేశారు.
Deputy CM Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకు చర్చ జరగలేదు.. దానిపై నేనే నిర్ణయం తీసుకోవాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు తీసుకోవాల్సి నిర్ణయం తీసుకున్నారు.. కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు అన్నారు.