నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పంచాయతీ.. చినికి చినికి గాలి వానలా మారి ఒక రకంగా జిల్లా పార్టీనే షేక్ చేస్తోంది. ఓ ముఖ్య నేత సన్నిహితుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా.. మరో ముఖ్య నేత సన్నిహితుని కుమారుడిని ఏకంగా అదుపులోకి తీసుకున్నారు.
భద్రాద్రి జిల్లాకు హెడ్ క్వార్టర్ కొత్తగూడెం. ఈ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుగాను... ఒక్క కొత్తగూడెం మాత్రమే జనరల్ సీటు. మిగతా నాలుగు ఎస్టీ రిజర్వ్డ్. ఇక నియోజకవర్గంలో మొన్నటి వరకు రెండు మున్సిపాలిటీలు ఉండగా... అందులో పాల్వంచకు రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరగడం లేదు. దీంతో పట్టుబట్టి రెండు మున్సిపాలిటీలకు మరి కొన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా చేయించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
Telangana: తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వాటా కింద రూ. 4872 కోట్ల నిధులకు అనుమతినిచ్చింది. రాష్ట్రంలోని రహదారి మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ ఇప్పటికే అనేక ప్రతిపాదనలను రెడీ చేస్తోంది.
Devaraj Arrested: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవకతవకల కేసులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్‌ను ఈరోజు (జూలై25) సాయంత్రం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Minister Ponnam: ఢిల్లీలో అఖిల భారత నాయకత్వంతో కీలక సమావేశాలు జరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిన్న ఖర్గే నివాసంలో తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది.. భారత్ జోడో యాత్రలో అసమానతలు గమనించి కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Amazon Great Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి తమ కస్టమర్లను ఆకట్టుకునేలా అద్భుతమైన సేల్‌తో ముందుకొచ్చింది. ఇప్పటికే జులై 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ నిర్వహించిన ఈ- కామర్స్ దిగ్గజం.. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా మరో భారీ సేల్‌ను ప్రకటించింది.
WI vs Pak: వెస్టిండీస్‌తో త్వరలో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్లను ఈరోజు (జులై 25) ఆ దేశ బోర్డు ప్రకటించింది. టీ20 జట్టుకు సల్మాన్ అఘా, వన్డే జట్టుకు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఈ సిరీస్‌తో స్టార్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది టీ20ల్లోకి మరోసారి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక, మాజీ సారథి బాబర్ ఆజమ్‌కు మళ్లీ చుక్కెదురైంది.
Plant Paddy On Road: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలానికి చెందిన వెంకటాపూర్ గ్రామ రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ వర్షం చినుకు పడితే చిత్తడే అన్న మాట ఆ గ్రామానికి సరిగ్గా సరిపోతుంది. కాస్త వర్షం పడితే చాలు, ఊర్లోని రోడ్డు పూర్తిగా బురదమయం అయిపోతుంది.
Karun Nair Cries: కరుణ్ నాయర్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బ్లూ జెర్సీ వేసుకున్న కరుణ్ నాయర్ ఏడుస్తున్నట్లుగా అందులో కనబడుతుంది. ఇక, కరుణ్ ను అతడి చిన్ననాటి స్నేహితుడు కేఎల్ రాహుల్ ఓదారుస్తున్నట్లుగా కనిపిస్తుంది.
Ramchander Rao: మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి.. నోబెల్ ప్రైజ్ కాదు, గోబెల్స్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ సెటైర్లు వేశారు.