Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. భక్తుల సౌకర్యాలు, భద్రత, శ్రీవారి సేవలకు సంబంధించి అనేక మార్పులు చేయనున్నట్లు సమాచారం.
CM MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఇవాళ (జూలై 21న) ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా కల్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపించడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు.
Air India Flight: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇవాళ (జూలై 21న) ఉదయం ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభలో విపక్షాలకు కూడా మాట్లాడటానికి అవకాశం ఉండాలి అని డిమాండ్ చేశారు. సభలో నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను.. రక్షణ మంత్రి, ఇతరులు మాట్లాడతారు.. కానీ, విపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వలేదు అని మండిపడ్డారు.
Lok Sabha: ఈ రోజు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా లోక్ సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అలాగే, వాయిదా తీర్మానాలపై చర్చించాలని కోరారు.
Gandikota Murder Case: కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి వారం రోజులు అవుతున్నప్పటికీ ఈ కేసు ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. అయితే, పోలీసుల విచారణలో కీలక విషయాలు గుర్తించినట్లు సమాచారం.
Mudragada Padmanabham: కాపు సంఘం నాయకుడు, మాజీ మంత్రి, వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగానే ఉందని ముద్రగడ తనయులు బాలు, గిరిబాబు తెలిపారు. ఇక, మా తండ్రి ఆరోగ్యం పట్ల వస్తున్న వదంతులు నమ్మవద్దు అని సూచించారు.
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన అమానుష ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి సాంకేతిక, పరిపాలన వ్యవహారాల పరిశీలన కోసం 12 మంది సభ్యులతో కూడిన టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర జలసంఘం ప్లాన్ చేస్తుంది.
Sattenapalle: వైసీపీ మాజీ మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు నేడు (జూలై 21న) సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు. రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.