Minister Anagani: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు వైసీపీ నేతల మతిభ్రమించి మాట్లాడుతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. కొందరు చరిత్ర హీనులు ఉంటారు.. వారి గురించి మాట్లాడి నా స్థాయిని దిగజర్చుకోలేను అని సెటైర్ వేశారు. జగన్ రెడ్డి నిజంగా ప్రజాహితం కోరితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు అని అడిగారు. ఇక, ప్రశ్నించడానికి ఏమీ లేదు కాబట్టే జగన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదు అన్నారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 13 నెలల కాలంలో 56 సార్లు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు అని మంత్రి అనగాని పేర్కొన్నారు.
Read Also: Mahabubabad: తల్లి కర్కషత్వం.. కొడుకు పై వేడి నీళ్ళు పోసి దారుణం.. కారణం అదే!
ఇక, వైఎస్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ప్రజల వద్దకు రాలేదు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించటానికి పర్యటనలు చేస్తున్నాడు అని ఆరోపించారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తిని పరామర్శించేందుకు వచ్చి మరో ముగ్గురిని చంపేశాడు.. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై ఏం మాట్లాడాలో తెలియక వైసీపీ నేతలకు మతిభ్రమించింది.. వై నాట్ 175 అని 11 సీట్లకు పడిపోయారు.. ఇప్పుడు మేము గెలిస్తే.. బతికితే చాలు అని అంటున్నారు.. ఇంకో వందేళ్లయినా వైసీపీ పార్టీని ప్రజలు నమ్మేస్థితిలో లేరు అని అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.