తాజాగా సూర్య రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో ఓపెనింగ్స్ నిలబెట్టినా, సినిమా లాంగ్ రన్లో కష్టమేననే మాట వినిపిస్తోంది. ఆ సంగతి పక్కనపెడితే, సూర్య తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేయబోతున్నాడు. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన వెంకీ అట్లూరి, తమిళ హీరో ధనుష్‌తో సార్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో లక్కీ […]
బాలీవుడ్లోనే కాదు, ఇండియా వైడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం మేటర్నిటీ బ్రేక్‌లో ఉంది. ఆమె సెప్టెంబర్ నెలలో ఒక చిన్నారి పాపకు జన్మనిచ్చింది. ఆమె త్వరలోనే మళ్లీ షూటింగ్లలో బిజీ కాబోతోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె మరోసారి ప్రభాస్‌తో జతకట్టబోతుందని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్న స్పిరిట్ సినిమాలో నటించమని ఇప్పటికే ఆమెను కోరినట్లు తెలుస్తోంది. Read More:Suriya : రెట్రో డే -1.. హయ్యెస్ట్ ఫర్ […]
సోనుధి ఫిల్మ్ ఫ్యాక్టరీ అధినేత ఆర్.యు. రెడ్డి, తమ బ్యానర్లో ప్రారంభమైన తొలి చిత్రం ప్రొడక్షన్ నం.1 షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ సినిమా ఒక వినూత్న కథాంశంతో రూపొందింది. అనేక భావోద్వేగాలు కలగలిసిన ఈ కథ, చాలా ప్రత్యేకమైనది. మంచి కథ కావడంతో, మా నటీనటులు ఆశిష్ గాంధీ మరియు మానస రాధాకృష్ణన్ నుండి అద్భుతమైన సహకారం లభించింది. దీంతో అనుకున్న సమయానికే షూటింగ్‌ను పూర్తి చేయగలిగాము,” […]
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు , యువ నటుడు ఆశిష్ రెడ్డి తన తాజా చిత్రం ‘దేత్తడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఆదిత్య రావు గంగసాని రూపొందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా మాస్ అప్పీల్‌తో కల్చరల్ డ్రామాగా తెరకెక్కనుంది. ఆశిష్ పుట్టిన రోజు సంధర్భంగా ఈ సినిమా ఫస్ట్ […]
హైదరాబాద్, మే 1, 2025: ప్రముఖ తెలుగు సినీ నటుడు విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. లాయర్ కిషన్ లాల్ చౌహాన్ దాఖలు చేసిన ఈ ఫిర్యాదులో, విజయ్ దేవరకొండ ‘రెట్రో’ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఆదివాసీ సముదాయాన్ని అవమానించినట్లు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీసులు ఈ ఫిర్యాదును పరిశీలిస్తున్నారు. ‘రెట్రో’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చదువు ప్రాధాన్యతను వివరిస్తూ.. పాకిస్థాన్ టెర్రరిస్టులను ఉద్దేశించి […]
సరికొత్త ప్రేమకథతో ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ తన తొలి చిత్రాన్ని రూపొందిస్తోంది. వరలక్ష్మీ పప్పు సమక్షంలో, కనకదుర్గారావు పప్పు నిర్మాతగా, భాను దర్శకత్వంలో ఈ చిత్రం యువతను ఆకర్షించేలా రూపుదిద్దుకుంటోంది. ‘సందేశం’ వంటి సామాజిక స్పృహతో కూడిన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు భాను, ఈసారి తన స్టైల్‌ను మార్చుకుని ఒక స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించారు. 49 రోజులపాటు నాన్-స్టాప్ షూటింగ్‌తో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ […]
‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి విభిన్న చిత్రాలతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాజ్, ఇప్పుడు సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ **‘కిల్లర్’**తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. హీరోయిన్గా జ్యోతి రాయ్ నటిస్తుండగా, విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ఆర్ సంస్థలతో కలిసి థింక్ సినిమా […]
విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘కింగ్డమ్’ నుంచి అందరూ ఎదురుచూస్తున్న తొలి గీతం ‘హృదయం లోపల’ ప్రోమో విడుదలైంది. ఈ పాట పూర్తి వెర్షన్ మే 2, 2025న విడుదల కానుంది, అది కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయం విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కలిసి ఒక చిత్రంలో పనిచేస్తే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. Read More:Balakrishna : ప్లేస్ ఏదైనా.. బాలయ్య గ్రేస్ తగ్గేదేలేదేస్! […]
తెలుగు సిని దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ తాజాగా తన కొత్త Range Rover కారు రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు కేటాయించిన ఫ్యాన్సీ నంబర్ TG09F0001 సినీ అభిమానుల్లో, సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సందర్భంగా ఆర్టీఓ ఆఫీస్ వద్ద తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఇందులో బాలకృష్ణ లుక్, గ్రేస్ అభిమానులను ఆకట్టుకుంటోంది. Read […]
దసరాలో కీలక పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టి, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల హీరోలుగా యుక్తి తరేజా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కె.జె.క్యూ – కింగ్, జాకీ, క్వీన్’. నాగార్జున కేడీ డైరెక్టర్ కె.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. 1990ల నేపథ్యంలో పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ తొలి ఫ్రేమ్ నుంచి చివరి షాట్ వరకు […]