అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే, ఆ తర్వాత అల్లు అర్జున్ ఇతర సినిమాలతో బిజీ అవడంతో ఈ సినిమా ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే, సినిమా ఆగలేదని, తర్వాత తీస్తామని దిల్ రాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే, ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై దిల్ రాజు తాజాగా స్పందించారు.
Also Read:Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను!
తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లోభాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంగా దిల్ రాజుని ఇదే విషయం గురించి ప్రశ్నించారు. పుష్ప 1, పుష్ప2, అట్లీతో సినిమా తర్వాత అల్లు అర్జున్కి ఈ సినిమా కథ రెలెవెంట్‌గా ఉంటుందా అని అడిగితే, ఐకాన్ వచ్చిన తర్వాత ఆయనతో సినిమా చేయాలని అనుకోవడం లేదని, కాకపోతే స్క్రిప్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పారు.
Also Read:Paramapada Sopanam: పూరి స్టయిల్లో ‘పరమపద సోపానం’ టీజర్
ఇది యూనివర్సల్ స్క్రిప్ట్ అని, తమ్ముడు రిలీజ్ అయిన తర్వాత వేణు శ్రీరామ్ ఆ ఫైల్ బయటకు తీస్తాడని అనుకుంటున్నానని అన్నారు. ఇది ఏ జానర్ సినిమా అని అడిగితే, హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడిన ఒక యాక్షన్ ఫిలిం అని, వివరించారు. అయితే, అల్లు అర్జున్ ఐకాన్ రేసులో లేకపోవడంతో ఆ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి, ఆ హీరో ఎవరవుతారనేది.