స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నిజానికి ఆమె స్టార్ హీరో విజయ్‌తో రిలేషన్‌లో ఉందని గతంలో తమిళ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే, ఆ విషయంపై విజయ్ కానీ, త్రిష కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, త్రిష తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా చేసిన లేట్ నైట్ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.
Also Read:Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?
ఆ పోస్ట్‌లో విజయ్ ఒక కుక్కపిల్లని ఎత్తుకొని ఆడిస్తూ ఉండగా, ఆయన పక్కనే కూర్చుని త్రిష కనిపిస్తోంది. ఆ కుక్కపిల్ల త్రిషకి పెంచుకునే ఇజ్జీ కాగా, దాన్ని విజయ్ ఆడిస్తూ ఉండడం గురించి చర్చ జరుగుతోంది. వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో అనే విషయం వారు బయటపెడితే తప్ప క్లారిటీ రాదు. కానీ, తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియా సైతం ఇప్పుడు ఇదే అంశంపై రకరకాల వార్తలు వండి వడ్డిస్తున్నాయి.
Also Read: Raviteja: ఆగస్టులో ‘మాస్ జాతర’ చేయాల్సిందే!
ప్రస్తుతం విజయ్ హీరోగా జననాయగన్ అనే సినిమా తమిళంలో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో జననాయకుడు అనే పేరుతో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక మరోపక్క, విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి అందులో కూడా బిజీగా ఉన్నారు. విజయ్ చివరి సినిమాగా జననాయగన్ రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, ఏం జరుగుతుందో వేచి చూడాలి.