ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణిని కలిసిన పార్వతీపురం మన్యం జిల్లా బోర్డర్ గ్రామాల గిరిజనులు.. మేం ఆంధ్రలోనే ఉంటాం అంటున్నారు.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని వివాస్పద గ్రామాలైన నేరాళ్లవలస, దొర్ల తాడివలస, దూళిబంద్ర, ఎగవసెంబి, దిగువ సెంబీ, పణుకులోవ గూడాలకె చెందిన గిరిజనలు నేడు మాజీ డిప్యూటీ సీఎంను కలిశారు..
పార్వతీపురం జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి .. టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు.. తాను అవినీతి చేశాను అని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పేర్కొన్నారు
గడిచిన రెండు ఎన్నికలలోనూ వైసీపీకి ఉమ్మడి విజయనగరం జిల్లా ఏజెన్సీలో తిరిగులేని మెజారిటీని అందించారు జనం. ఇప్పుడు సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ సెగ్మెంట్లను కలుపుతూ కొత్తగా మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. జిల్లా వైసీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. ఆ హోదాలో జిల్లా కేంద్రంలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు కూడా. ఈ సందర్భంగా ఫ్లెక్సీలతో నగరాన్ని ముంచేశారు. అంతా కలిసి సాగుతారు అని అనుకుంటున్న తరుణంలో నాయకుల మధ్య…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. ప్రస్తుతం ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుంటున్నారు పుష్ప శ్రీవారి… విజయవాడ నుండి విజయనగరం వెళ్తుండగా.. ఆమె స్వల్ప అస్వస్థతకు గురైనట్టు అనుచరులు చెబుతున్నారు.. అయితే, పుష్ప శ్రీవాణి అస్వస్థతకు గురైన కారణాలతో పాటు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. కాగా, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం…
వాలాంటీర్లకు సత్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి హాట్ కామెంట్స్ చేశారు. పలువరు వాలంటీర్లపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో వైసీపీకి, జగన్ కు వ్యతిరేకంగా బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. కురుపాం మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని, గరుగుబిల్లి మండలంలో ఒక వాలంటీర్ భర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారని…