Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్ని భర్తీ చేసింది. 37 మంది నాయకులకు పదవులు ఇచ్చి బాధ్యతలను అప్పగించింది. సాధారణ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు… పార్టీ కోసం పనిచేసిన అనుబంధ సంఘాల చైర్మన్ లకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులను కట్టబెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్‌గా ఆయనే ఉండడంతో… పనిచేసిన వాళ్లందర్నీగుర్తించి మొదటి విడతలోనే పదవులు ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి తిరిగే లేని.. ఎవరు ఎదుర్కోలేరని సీఎం రేవంత్‌రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. జులై 4 న హైదరాబాద్‌కి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జి మంత్రులదే అని స్పష్టం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలపై ఇన్‌ఛార్జి మంత్రులు దృష్టిపెట్టడం లేదని.. ఇది కరెక్ట్ కాదన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే జిల్లాలో పదవులు భర్తీ చేయాలని సూచించారు. కార్యకర్తలను నారాజ్ చేయకండని పిలుపునిచ్చారు.
నేతలందు చిత్తూరోళ్ళు వేరయా అన్నట్టుగా ఉందట టీడీపీలో పరిస్థితి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకుగాను 12 స్థానాలు గెలిచింది కూటమి.దీంతో పార్టీ కోసం పని చేసిన ముఖ్య నేతలంతా... మంత్రి పదవులు కోసం, మిగిలిన వారు నామినేటెడ్ పదవుల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ.. అన్ని పార్టీలకు చెందినవారికి సముచిత స్థానం కల్పిస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. ఇవాళ 22 మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ మరో లిస్ట్ విడుదల చేశారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సంఘాల (డీసీఎంఎస్) ఛైర్మన్లను నియమిస్తూ సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ (టీడీపీ), విశాఖ డీసీసీబీ ఛైర్మన్‍గా కోన తాతారావు (జనసేన), కడప డీసీసీబీ ఛైర్మన్‌గా బి.సూర్యనారాయణ రెడ్డి (టీడీపీ)లు నియమితులయ్యారు. శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్‍గా అవినాష్ ఛౌదరి (టీడీపీ), విశాఖ డీసీఎంఎస్ ఛైర్మన్‍గా కొట్ని బాలాజీ (టీడీపీ)లు…
ఆంధ్ర ప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రస్తుతం పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఎవరికి ఏ పదవులు వస్తాయి పార్టీకి కష్టపడినా వాళ్లకు పదవులు వస్తాయా లేదా అనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటున్నారు.. ఎవరెవరికి నామినేటెడ్ పదవులు.. ఇవ్వాలి... కార్యకర్తలు ఎవరు పార్టీకోసం సీరియస్ గా వర్క్ చేశారు అదేవిధంగా ద్వితీయ శ్రేణి నేతలు ఎవరున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే మెజార్టీ పదవుల్లో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను కూర్చోబెట్టిన ప్రభుత్వం.. ఈ రోజు మరో 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించింది.. 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్..
మూడో జాబితాలో మరికొన్ని కీలక పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్.. దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి చేశారు.. 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితా సిద్ధం అవుతోందట.. చైర్మన్ పదవులకు 2 నుంచి 3 పేర్ల ప్రతిపాదనలు రాగా.. ఈ వారంలో పదవుల భర్తీకి సన్నాహాలు సాగుతున్నాయి.. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది సర్కార్..