త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి మధ్య హోరాహోరీ ఫైటింగ్ సాగేలా ఉంది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుంటే... ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇలా ఇరు పక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలనడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సనాతన ధర్మాన్ని సమర్థించే వారెవరయినా, పవన్ కళ్యాణ్ తో సహా శిక్షించాలి,అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం క్రూరమైనదని.. అరాచకమైనదన్నారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు.
మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి నియోజకవర్గ ఓటర్ ఫోన్ చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేసవిలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని.. తీర్చాలని ఎమ్మెల్యేని ఓటర్ కోరాడు. త్వరలోనే తాగు నీటి కోసం నియోజకవర్గానికి రూ. 2 కోట్లు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. ఎప్పుడు వస్తాయని అడిగితే గ్యారెంటీ లేదని సమాధానమిచ్చారు ఎమ్మెల్యే సంజీవ…
Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ వైయస్సార్‌సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా ఆయన కూటమి సర్కార్‌ను నిలదీస్తూ తన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ సందేశాన్ని తెలిపారు. ఇక ఆ సందేశంలో పలు అంశాలపై సూటిగా ప్రశ్నించారు. ఇందులో ఏముందంటే.. చంద్రబాబు నాయుడు గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన…
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే టీటీడీ లడ్డుపై సిట్, గంజాయిపై ఈగల్, ఇప్పుడు రైస్‌పై సిట్.. ఇవన్నీ ప్రచారం కోసం తప్ప ఏం లేదన్నారు.
ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆర్ధిక పరిస్థితులు, భవిష్యత్ లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆర్ధిక వనరులు ఉంటాయా అని అంచనా వేయకుండా హామీలు ఇస్తుంటారు.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
వేసవి వచ్చేసింది. మండే ఎండలకు తోడు నీటి కొరత జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో…గుక్కెడు నీటి కోసం జనం అలాడిపోతున్నారు. తాగునీటి సరఫరాలో నీటివనరులు, లేదా సాంకేతిక సమస్యలు ఉంటే ట్యాంకర్లతో అయినా సరఫరా చేస్తారు. ఈ నియోజకర్గంలో ఆధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తాగునీరు సరఫరా కాకపోవడంతో క్యాను నీటికి 15 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఆలూరు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ…