YS Jagan: హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై దాడిని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వైసీపీపై మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అన్నారు.
Yanamala Ramakrishnudu: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తునిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఎప్పుడూ ప్రతిపక్షం మీద ఒక కన్నేసి ఉంచాలని, ప్రతిపక్షం బలం అనుకుంటేనే మనం పని చేయగలమని అన్నారు యనమల రామకృష్ణుడు.. ప్రతిపక్షం ఏముందిలే ఊదితే ఎగిరిపోతారు అనుకుంటే పొరపాటు అని.. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతామని కార్యకర్తలను హెచ్చరించారు.. అయితే, మెడికల్ కాలేజ్ ల నిరసనలో ప్రతిపక్షంలో కసి పెరిగిందని.. ర్యాలీ…
TDP vs YSRCP: తాడిపత్రి రాజకీయ రంగం మళ్లీ వేడెక్కింది.. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటాపోటీ కార్యక్రమాలతో మరోసారి హీట్ పెంచింది.. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం మరోసారి రాజకీయ వేడిని చవి చూస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టగా, అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి…
SVSN Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పిఠాపురంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నారు.. గీత అక్కయ్య అమావాస్య పౌర్ణమికి కనిపిస్తూ.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వంగా గీతపై మండిపడ్డారు.. దమ్ముంటే ఉప్పాడ సెంటర్ కి వచ్చి చర్చించాలి అంటూ సవాల్ చేవారు.. ఎంపీగా పిఠాపురానికి గుండు సున్నా ఇచ్చారు అంటూ వంగా గీతపై విరుచుకుపడ్డారు..…
స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు అని.. పోలీసులు ఇప్పుడు అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. స్పీకర్కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదని, జగన్ వెళ్లి చూపిస్తారని విమర్శించారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవోను, నిర్మాణాలను, పనులు ఆపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తామని తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు…
Perni Nani: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురూ కలిసి మూడు ఖాకీ చొక్కాలేశారన్నారు. ఆటో డ్రైవర్ సేవలో పేరుతో డ్రైవర్లకు డబ్బులేశామని చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో రాష్ట్రమంతా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారని చెప్పారు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పాడని చంద్రబాబు తెలిపారు. ఎవరైనా ప్రశిస్తే తోలు తీస్తామన్నారని గుర్తు…