ఒకవైపు వరద నీరు, మరో వైపు యువత కేరింతలు. కోనసీమ జిల్లాలో వరద నీటిలో వాలీబాల్ వైరల్ అవుతోంది. యువత ఎక్కువగా వాలీబాల్ ని ఇష్టపడుతూ వుంటుంది. సాధారణంగా వాలీబాల్ అంటే చేతులతో గ్రౌండ్ లో ఆడతారు. ప్రపంచ వ్యాప్తంగా ఆడే ప్రాచుర్యమైన ఒక ఒలంపిక్ క్రీడ ఇది. రెండు జట్లు పాల్గొనే ఈ క్రీడలో ఒక్కో జట్టు కొన్ని నిబంధనలను ఆచరిస్తూ ప్రత్యర్థి జట్టు కోర్టులోకి బంతిని పంపి పాయింట్లు సాధిస్తారు.
ఒక ఆటగాడు కోర్టు బయటకు వెళ్ళి బంతిని పైకె గరేసి వల మీదుగా అవతలి కోర్టులో పడేటట్లు సర్వ్ చేస్తాడు. అవతలి జట్టు వారు బంతి కింద పడకుండా మూడు ప్రయత్నాల్లో తిరిగి ఇవతలి జట్టు కోర్టు లోకి పంపించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఆటను చేతులతోనే ఆడతారు. కానీ శరీరంతో ఒకసారి తాకడం న్యాయబద్ధమైనదే. అయితే గోదావరి జిల్లాల్లో ఇప్పుడు వరద నీటిలో వాలీబాల్ ఫ్యామస్ అవుతోంది.సముద్రం చెంత ఇసుకలో వాలీబాల్ ఆడడం కామన్, కానీ వరద నీటిలో వాలీబాల్ ఆడుతూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
వరదలతో సతమతం అవుతున్న కోనసీమ జిల్లాలో వరద నీటిలోనే తమకు ఇష్టమయిన వాలీబాల్ ఆడేస్తున్నారు యువత. పి.గన్నవరంలో వరద నీటి లో వాలీబాల్ ఆడిన గోదావరి కుర్రోళ్ళు ఇప్పుడు వైరల్ గా మారారు. సోషల్ మీడియాలో ఇదే పెద్ద హాట్ టాపిక్ అవుతోంది. వరద నీరు ముంచెత్తితే మాకేం భయం.. మా ఆట మాది.. వరద నీటిలో ఏమాత్రం అలసట లేకుండా వాలీబాల్ ఆడేస్తాం అంటున్నారు యువత. ఈ వాలీబాల్ ఆటలో అంతగా అలసట వుండదు.
ఎందుకంటే నీటిలోనే వుంటారు కాబట్టి వారికి అంతగా ఇబ్బంది వుండదు. బంతి కూడా ఎక్కడ వుంటుందో వారికి అర్థమైపోతుంది. కిందపడితే దెబ్బలు తగులుతాయనే బాధ లేనే లేదు. ఎంచక్కా నీటిలోనే తిరుగుతూ.. నీటిలో బంతిని ఆడిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఈ నీటిలో ఏమైనా వస్తే మాత్రం తెలీదు. ఎందుకంటే కోనసీమలో అనుకోని అతిథులు వచ్చి పలకరించి వెళ్ళిపోతున్నాయి. ఇళ్ళ చావిడిలో, బట్టలు ఆరేసే తాళ్ళమీద, మంచం కోళ్ళు, ఎత్తైన అరుగులు, మంచాల మీద పాములు తిష్టవేస్తున్నాయి. అదొక్కటే ఇబ్బంది. ఎంత నీరున్నా వాలీబాల్ ఆడేస్తున్న ఈ కోనసీమ కుర్రాళ్ళను చూసి.. వీళ్ళు మామూలోళ్ళు కాదంటున్నారు నెటిజన్లు. కాదేదీ ఆటకు అనర్హం అన్నట్టుంది ఈ కుర్రాళ్ళ వ్యవహారం.
Viral: నదిలో యువకుడి స్టంట్.. తిరిగిరాలేదు..