Bhadrachalam: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి స్వల్పంగా వరద పెరిగింది. ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద 24 అడుగుల వద్ద చేరుకొని ఉంది ఇది మరి కొంత పెరిగే అవకాశం కనబడుతుంది.
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర మళ్ళీ గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన వరద మళ్ళీ పెరుగుతుండటంతో ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. దేవీపట్నం మండలంలోని 30 గిరిజన గ్రామాలు వరద ముంపులోనే కొనసాగుతున్నాయి. ఇళ్లన్నీ వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద కూడా వరద నీరు తగ్గుముఖం పట్టలేదు. దండంగి, రావిలంక, తొయ్యేరు-దేవీపట్నం…
తూర్పుగోదావరి జిల్లా : గోదావరి వరద ప్రవాహం శాంతించినట్లు కనిపిస్తోంది. దీంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గౌతమి, వృద్ధగౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలలో శాంతించి క్రమంగా తగ్గుముఖం పట్టింది వరద. ఇక అటు పి.గన్నవరం మండల పరిధిలోని గంటిపెదపూడి శివారు బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడి శివారు ఊడిమూడిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. read also : మహిళలకు షాక్… మళ్లీ పెరిగిన బంగారం ధరలు అధికారులు ఏర్పాటు చేసిన రెండు ఇంజన్ పడవలపైనే…
తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వాగునీరు చేరడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా వరద నీరు చేరడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాగా దేవీపట్నం నుంచి మైదాన ప్రాంతాలకు రాకపోకలు మంగళవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. పోలవరంలో ముంపునకు గురవుతున్న పలు గ్రామాల ప్రజలు తమ సామగ్రిని తరలించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.