విశాఖలో నిర్వహించిన న్యాయ సాధన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు నలుగురు పాడేకట్టారని ఆరోపించారు. ఆ పాపంలో మోడీ, చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిపారు. ఉక్కును అమ్మకానికి పెడితే అడ్డుకోలేని వీళ్ళందరినీ ఉరితీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మోస పూరిత పార్టీలకు పాతర వేయాలని సూచించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు. వీళ్ళకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలిసిందేనని మండిపడ్డారు.
Read Also: PM Modi: హెడ్‌లైన్స్ కోసం కాదు.. డెడ్‌లైన్‌ల కోసం పని చేస్తున్నా..
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. రెబల్ రేవంత్ రెడ్డి, ఏపీలో కాంగ్రెస్ కు ఆక్సిజన్ ఇస్తున్న షర్మిళ కలిసి వచ్చారంటే విశాఖ ఉక్కును అమ్మడం ఎవరి తరం కాదని అన్నారు. అదానీ అంటే గంజాయి స్మగ్లర్ ఆయన గురువు మోడీ అని విమర్శించారు. విశాఖ ఉక్కు భూములను గంజాయి గోదాములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీకి ఎవరు మద్దతు ఇచ్చిన వాళ్ళు ద్రోహులు కిందేనని అన్నారు. తెలుగు ప్రజానీకానికి మొదటి శత్రువు మోడీ.. ఘోరీ కట్టాలిసిందేనని తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం ప్రేమ లేఖలు రాస్తే కేంద్రం తలోగ్గదని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గట్టి ప్రయత్నం చేయాలని కోరారు. పోరాటానికి మేం సిద్ధం.. ప్రభుత్వం సిద్ధం అవునో కాదో చెప్పాలన్నారు.
Read Also: Razakar: సివిల్స్ వదిలేసి నటన వైపు.. ఆసక్తికరంగా రజాకార్ నటి జర్నీ..!