CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: విశాఖలోని పేదలకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దశాబ్దాలుగా సొంత ఇంటిపై హక్కు కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కలను సాకారం చేసేందుకు రేపు విశాఖపట్నం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు, హక్కు పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు పూర్తి హక్కులు కల్పించేలా ఈ భూముల క్రమబద్ధీకరణ చేపట్టినట్లు సీఎం తెలిపారు. మొత్తం 11 మండలాల్లో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం కేవలం పట్టాల పంపిణీ మాత్రమే కాదని, దశాబ్దాలుగా హక్కుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది కీలక ఘట్టమని చంద్రబాబు పేర్కొన్నారు. పట్టా పొందిన ప్రతి కుటుంబానికి విలువైన ఆస్తి, భవిష్యత్తుకు భద్రత, పిల్లలకు వారసత్వ సంపద లభిస్తుందని ఆయన అన్నారు. విశాఖను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తూనే సామాన్య ప్రజలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. పేద కుటుంబాలకు సొంత స్థలంపై చట్టబద్ధమైన హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 19న విశాఖలో జరిగే కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి, కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు..
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది…తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా!
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా… pic.twitter.com/487Mw5szq2
— N Chandrababu Naidu (@ncbn) September 18, 2026
తాజావార్తలు
-
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!