GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVMC Wards Delimitation: జనాభా పెరుగుతున్న కొద్ది.. వారి అవసరాలు.. పరిపాలన సౌలభ్యం దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు వార్డులు, నియోజకవర్గాలు.. ఇలా పునర్విభజన చేస్తూనే ఉంటుంది.. ఇక, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) వార్డుల పునర్విభజనకు సంబంధించి మున్సిపల్ శాఖ తుది గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఉన్న 98 వార్డుల సంఖ్యను 120కి పెంచుతూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
వార్డుల పునర్విభజనపై గతంలో విడుదల చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌కు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అధికారులు.. ఆ తర్వాత వార్డుల సరిహద్దులను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది మున్సిపల్ శాఖ.. వార్డు నంబర్ 1 నుంచి 120 వరకు ప్రతి వార్డు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు, సరిహద్దులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, గతంలో GVMCలో 98 వార్డులు ఉండగా.. తాజా పునర్విభజనతో GVMC పరిధిలో మొత్తం 120 వార్డులు అందుబాటులోకి రానున్నాయి.
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
కాగా, వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి ఇప్పటికే ఏపీ సర్కార్ షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే.. రాష్ట్రంలోని 39 పురపాలక సంఘాలు (ULBs), నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన గడువు ముగిసింది.. విజయవాడ, తిరుపతి, కర్నూలు, అనంతపురం, చిత్తూరుతో పాటు పార్వతీపురం, సాలూరు, నర్సీపట్నం, రామచంద్రపురం, జగ్గయ్యపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, మార్కాపురం, చీరాల, ప్రొద్దుటూరు, రాయచోటి, రాయదుర్గం, పుట్టపర్తి, బద్వేల్, నగరి, పుత్తూరు, కదిరి, యర్రగుంట్ల, జమ్మలమడుగు, పలమనేరులో ఈ నెల 3వ తేదీ నాటికి పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని గతంలోనే నిర్ణించింది.. ఇక, GVMC, ఏలూరు, మచిలీపట్నం, పెడన, పిఠాపురం, ఒంగోలు, గుంటూరు, కడప, ధర్మవరం, తాడిపత్రి, నంద్యాలలో ఈ నెల 8వ తేదీ నాటికి వార్డుల విభజన పూర్తి చేయడానికి గడువు విధించింది. మరోవైపు, చిలకలూరిపేట, నెల్లూరు నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ ఈ నెల 15 అంటే ఇవాళ్టి వరకు పూర్తిచేసేలా ఏపీ మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!