Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- రాఖీ పండుగ రోజే విషాదం..
- భార్య, ఇద్దరు చిన్నారులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య..
- రాఖీ కట్టించుకుని రాత్రికి దారుణ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Tragedy: రాఖీ పండుగ రోజున విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ తన భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతుడిని మల్ల ప్రవీణ్ కుమార్‌గా గుర్తించారు. ఆయన స్వస్థలం కొత్తవలస కాగా, జీవనోపాధి కోసం పెందుర్తిలోని ఓ అద్దె ఇంట్లో భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ కుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా, ఆయన భార్య కూరగాయల వ్యాపారం చేసేవారని సమాచారం.
ఈ దంపతులకు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రవీణ్ కుమార్ తన అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకుని సరదాగా గడిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అదే రోజు రాత్రి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రవీణ్ కుమార్ వాట్సాప్ స్టేటస్‌లో ‘RIP’ అని పెట్టినట్లు సమాచారం. అనంతరం ఆయనతో పాటు భార్య, ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే నలుగురూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు సహా ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ కుమార్ కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తాజావార్తలు
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!