48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ai+ Nova 2 Power: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Ai+ మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. Ai+ Nova 2 Power పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో లాంచ్ చేయనుంది. లాంచ్ అనంతరం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. Nova 2 సిరీస్‌లో ఇది కొత్త మోడల్‌గా చేరనుంది.
Ai+ Nova 2 Powerకు సంబంధించి కంపెనీ ఇప్పటికే పలు వివరాలను టీజ్ చేసింది. లీకులు, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్సెట్తో పనిచేయనుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే కంపెనీ సొంత nxtQ OS అందించనుంది.
Also Read
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
- Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
ర్యామ్, స్టోరేజ్ పరంగా ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. బేస్ మోడల్లో 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండగా.. మరో వేరియంట్లో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండనుంది. అయితే అధిక స్టోరేజ్ కోరుకునే వారికి 128జీబీ వరకే పరిమితం కావడం కొంత నిరాశ కలిగించే అంశం కావచ్చు.
ఫోన్లో ప్రధాన ఆకర్షణగా 7000mAh లిథియం-పాలిమర్ బ్యాటరీ ఉండనుంది. దీనికి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నారు. సాధారణ వినియోగంలో రోజంతా బ్యాకప్ అందించేలా బ్యాటరీని రూపొందించినట్లు Ai+ చెబుతోంది. అయితే వాస్తవ బ్యాటరీ బ్యాకప్ వినియోగ విధానం, నెట్వర్క్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
డిజైన్ పరంగా Nova 2 Power ఐదు కలర్ ఆప్షన్లలో రానుంది. డీప్ పర్పుల్, బ్లూ ఫ్యూజన్, గోల్డెన్ బ్లూ ఫ్యూజన్, మిడ్నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. కొన్ని వేరియంట్లలో గ్రేడియంట్ ఫినిష్ ఉండగా.. మరికొన్ని సాలిడ్ కలర్ డిజైన్‌తో కనిపించనున్నాయి.
కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనుక భాగంలో రైజ్డ్ స్క్వేర్ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో రెండు పెద్ద సర్క్యులర్ కెమెరా రింగ్స్, ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు మరో సర్క్యులర్ ఫీచర్ కనిపిస్తుంది. వెనుక భాగంలో 48MP AI Camera బ్రాండింగ్ ఉండటంతో ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది.
వెనుక ప్యానెల్ దిగువ భాగంలో Ai+ బ్రాండింగ్ ఉండగా.. కుడివైపు పవర్ బటన్‌కు రెడ్ యాక్సెంట్ ఇవ్వడం ద్వారా ఫోన్‌కు ప్రత్యేకమైన లుక్ తీసుకొచ్చారు.
Ai+ ఇప్పటికే భారత్‌లో Nova, Pulse సిరీస్‌ల కింద పలు స్మార్ట్ఫోన్లను అందిస్తోంది. Nova 2 Pro 5G, Nova 2 Neo 5G, Nova 2 Ultra 5G, Nova 2 5G, NovaFlip 5G, Pulse 2 వంటి మోడల్స్ సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. వీటికి కొనసాగింపుగా Nova 2 Powerను తీసుకొస్తోంది. ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లను సెప్టెంబర్ 19న జరిగే అధికారిక లాంచ్‌లో వెల్లడించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..