Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garlic Karam: వెల్లుల్లి కారంను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా.. ఇడ్లీ, దోశల్లో నంజుకున్నా.. లేదా వేపుడు కూరల్లో చల్లుకున్నా ఎంతో అద్భుతమైన రుచిని ఇస్తుంది. అయితే చాలామంది వెల్లుల్లి కారం చేసేటప్పుడు వెల్లుల్లిలోని తేమ కారణంగా ముద్దగా మారిపోతుంటుంది. అలా కాకుండా వెల్లుల్లి కారం ఎంతో సువాసనతో, పొడిపొడిగా, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా తయారు చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు పాటించాలి. మరి అవేంటో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు..
* ఎండుమిర్చి: కారానికి తగినన్ని,
* ధనియాలు: 1-2 టేబుల్ స్పూన్లు,
* జీలకర్ర: 1 టేబుల్ స్పూన్,
* మినప్పప్పు: 1 టేబుల్ స్పూన్,
* పచ్చిశనగపప్పు: 1 టేబుల్ స్పూన్,
* కరివేపాకు: ఒక రెమ్మ (శుభ్రం చేసి తడి ఆరినది),
* వెల్లుల్లి రెబ్బలు: ఒక కప్పు (పొట్టు తీయకుండా వాడాలి),
* ఉప్పు: రుచికి సరిపడా,
* నూనె: 1-2 టీస్పూన్లు (దినుసులు వేయించడానికి సరిపడా)..
Also Read
- Can Beer Damage Your Kidneys: బీర్ తాగితే కిడ్నీలకు ఏం కాదనుకుంటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
- Marriages: "పెళ్లి వద్దు.. సింగిల్ లైఫే బెటర్".. యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటోంది? 4 ప్రధాన కారణాలివే..
- Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్‌గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
- Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
తయారీ విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఒకటి లేదా రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి మంటను సిమ్‌లో ఉంచి దోరగా వేయించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, శుభ్రం చేసి తడి ఆరిన కరివేపాకు వేసి నిదానంగా కలుపుతూ మాడిపోకుండా వేయించుకోవాలి. దినుసులు సమానంగా వేగి సువాసన వచ్చే వరకు వేయించిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే ఆవిరి పట్టి కారం ముద్దగా అయిపోతుంది.
పొడిగా రావడానికి..
వెల్లుల్లి కారం పొడిపొడిగా రావడానికి ప్రధాన రహస్యం మిక్సీ పట్టే క్రమంలోనే ఉంది. చల్లారిన ఎండుమిర్చి, దినుసులను తగినంత ఉప్పుతో కలిపి మిక్సీ జార్లో వేసి ముందుగా మెత్తని పొడిలా రుబ్బుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ వెల్లుల్లిని ముందుగానే మిర్చి, దినుసులతో కలిపి వేయకూడదు. అలా వేస్తే వెల్లుల్లిలోని రసం బయటకు వచ్చి మిశ్రమం మొత్తం పేస్ట్‌లా మారిపోతుంది.
పల్స్ మోడ్..
కారం పొడి సిద్ధమైన తర్వాత మాత్రమే వెల్లుల్లి రెబ్బలను మిక్సీ జార్‌లోకి వేయాలి. వెల్లుల్లి వేసిన తర్వాత మిక్సీని నిరంతరాయంగా ఎక్కువ స్పీడ్‌లో తిప్పకూడదు. కేవలం మిక్సీలోని ‘పల్స్’ (Pulse) మోడ్‌ను ఉపయోగిస్తూ ఒకటి లేదా రెండు సార్లు ఆపుతూ ఆపుతూ (ఇన్చార్జ్ పద్ధతిలో) మాత్రమే తిప్పాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి ముద్ద కాకుండా, పొడితో చక్కగా కలిసి పొడిపొడిగానే ఉంటుంది.
నిల్వ చేసుకునే విధానం..
మిక్సీ పట్టిన తర్వాత ఆ కారంలో కాస్త వెచ్చదనం ఉంటుంది కాబట్టి, వెంటనే మూత పెట్టకుండా కాసేపు గాలికి ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకుంటే వెల్లుల్లి కారం తేమ పట్టకుండా, ముద్దగా మారకుండా ఎంతో పొడిపొడిగా, సువాసనతో నెలల తరబడి తాజాగా ఉంటుంది.
తాజావార్తలు
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
-
Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
-
Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
-
Kerala High Court: ‘దత్తత’ అనే పదం తొలగించండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!