ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో జారీ చేసిన జీవో 58, 59 నిబంధనలనే కొనసాగించింది. ఆక్రమిత భూములకు సంబంధించి జీవో 59 కింద రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. గతంలో ఉన్న ఆస్తి విలువలో 12.5% చెల్లించే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. మార్చి 31వ తేదీ వరకు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తును…
భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గం ఎంచుకుంది. ఆ బాధ్యతలను ఇకపై డిప్యూటీ తహసీల్దార్‌లకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్‌లకు ధరణి పోర్టల్‌లో లాగిన్ సౌకర్యాన్ని కల్పించింది. ఇకపై రిజిస్ట్రేషన్ వ్యవహారాల బాధ్యతలు కూడా వీళ్లే చూడనున్నారు. ధరణి పోర్టల్‌ను ప్రారంభించి ఏడాది పూర్తికావడంతో.. వెబ్ సైట్ లో పలు మార్పులు చేర్పులు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు చూసిన తహసీల్దార్‌లకు ఆ భారం తప్పించింది. డిప్యూటీ…
సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్ లో గోల్ మాల్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. 748ఎకరాల భూముల వివరాలను తొలగించినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2016లో చోటు చేసుకున్న పరిణామాలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం… రామచంద్ర మోహన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో రికార్డులు మారినట్టు భావిస్తుంది. ఈఓ కు అధికారం లేకపోయినా రికార్డుల్లో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం వెనుక పెద్దల ప్రమేయం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.…