Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
- ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ జెప్టోలో అందుబాటులోకి..
- ఎంపిక చేసిన ప్రాంతాల్లో వేగంగా డెలివరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 18 Pro In Zepto and Blinkit: ఆపిల్ (Apple) లేటెస్ట్ ప్రీమియం డివైజ్‌లను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో (Zepto)లో కూడా అమ్మకాలు జరగనున్నాయి. నేటి (సెప్టెంబర్ 18) ఉదయం 8 గంటల నుంచి జెప్టోలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ 5 అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ సేల్ ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు మాత్రమే పరిమితం కానుంది.
మరోవైపు బ్లింకిట్ (Blinkit)లో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, జైపూర్, లక్నో నగరాలలో డెలివరీ కానున్నాయి. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కొనుగోలుపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో గరిష్ఠంగా రూ.7,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. స్టోరేజ్, కలర్ వేరియంట్‌తో సంబంధం లేకుండా లిస్ట్ చేసిన ఐఫోన్లకు ఈ డిస్కౌంట్ వర్తించనుంది. మరోవైపు ఎయిర్‌పాడ్స్ 5పై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో ఫ్లాట్‌గా రూ.1,500 తగ్గింపు లభిస్తుంది.
Also Read
- Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ఈ బ్యాంక్ ఆఫర్లు ఎంపిక చేసిన యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు వర్తిస్తాయి. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా చేసే కొనుగోళ్లకు కూడా ఇన్స్టంట్ డిస్కౌంట్ వర్తించనుంది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కొనుగోలుకు ఎంపిక చేసిన కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. జెప్టోలో ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీ స్టోరేజ్ వేరియంట్లు లిస్ట్ కానున్నాయి. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ అన్ని స్టోరేజ్ వేరియంట్లలో బ్లాక్, సిల్వర్, బర్గండీ, గ్లేసియర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 18 ప్రో 2టీబీ వేరియంట్ మాత్రం బర్గండీ, గ్లేసియర్ రంగుల్లో మాత్రమే లభించనుండగా.. మిగతా స్టోరేజ్ వేరియంట్లు నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటాయి.
ఎయిర్‌పాడ్స్ 5 విషయానికొస్తే.. వైట్ కలర్లో స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ కేస్ వేరియంట్ కూడా జెప్టోలో లభించనుంది. ఈ రెండు వేరియంట్లపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో రూ.1,500 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే బ్యాంక్ డిస్కౌంట్, నో-కాస్ట్ ఈఎంఐకి సంబంధించిన పూర్తి నిబంధనలు కొనుగోలు సమయంలో జెప్టో యాప్‌లోనే కనిపించే అవకాశం ఉంది. కాబట్టి తమ కార్డుకు ఆఫర్ వర్తిస్తుందా లేదా అనేది కొనుగోలు చేసే ముందు వినియోగదారులు చెక్ చేసుకోవడం మంచిది.
ఇక వారంటీ విషయానికొస్తే.. జెప్టో నిబంధనల ప్రకారం ఉత్పత్తి వారంటీ బాధ్యత సంబంధిత తయారీదారుదే. అంటే ఐఫోన్‌కు సంబంధించిన వారంటీ ఆపిల్‌దే ఉంటుంది. అయితే రిటర్న్, రీఫండ్, ఎక్స్చేంజ్ నిబంధనలు జెప్టో పాలసీ ప్రకారం ఉంటాయి. ముఖ్యంగా ఖరీదైన ఎలక్ట్రానిక్స్‌కు అదనపు షరతులు ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసే ముందు రిటర్న్ పాలసీని తప్పనిసరిగా పరిశీలించాలి.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!