PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం ప్రారంభించి కాళ్లపై నిలబడాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు వారి ఆశలపై నీళ్లు చల్లుతుంటాయి. అలాంటి వారికి బాసటగా నిలిచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణం అందిస్తున్న ఈ ‘పీఎం విశ్వకర్మ యోజన’ ఇటీవలే విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చేతివృత్తుల వారు, శిల్పులు తమ సొంత ఉపాధిని ప్రారంభించడానికి వీలుగా ప్రధాని మోడీ 2023 సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో రాజమిస్త్రీలు, కార్పెంటర్లు, పడవలు తయారుచేసేవారు, కమ్మరులు, తాళాలు తయారుచేసేవారు, కుమ్మరులు, శిల్పులు, చేపల వలలు కుట్టేవారు, బొమ్మలు తయారుచేసేవారు సహా మొత్తం 18 రకాల సాంప్రదాయ వృత్తుల వారిని చేర్చారు.
ఈ పథకం కింద ప్రభుత్వం అందించే రూ.3 లక్షల రుణాన్ని రెండు దశల్లో అందజేస్తుంది. వ్యాపారం ప్రారంభించడానికి మొదటి విడతగా రూ.1 లక్ష, దాన్ని మరింత విస్తరించుకోవడానికి రెండో విడతగా రూ.2 లక్షల రుణం ఇస్తారు. అతి తక్కువగా కేవలం 5 శాతం వడ్డీ రేటుకే లభించే ఈ లోన్ పొందడానికి ఎలాంటి ఆస్తులను గ్యారెంటీగా కుదువ పెట్టాల్సిన అవసరం లేకపోవడం అతిపెద్ద విశేషం. కేవలం రుణ సాయమే కాకుండా, ఎంపిక చేసిన 18 వృత్తుల వారికి మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ కూడా ఇప్పిస్తారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలో రోజుకు రూ.500 చొప్పున స్టైపెండ్ అందించడమే కాకుండా, రూ.15,000 విలువైన టూల్‌కిట్ గ్రాంట్‌ను కూడా అందజేస్తారు. అలాగే లబ్ధిదారులకు పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్, ఐడీ కార్డ్‌తో పాటు బేసిక్, అడ్వాన్స్డ్ శిక్షణ ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తారు.
Also Read
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే పేర్కొన్న 18 వృత్తులలో ఏదో ఒకదానికి చెందినవారై ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆదాయ ప్రమాణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, గురింపు కార్డు, నివాస ప్రమాణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్, పనిచేసే మొబైల్ నంబర్ అవసరమవుతాయి. అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ (pmvishwakarma.gov.in) సందర్శించి, హోమ్‌పేజీలోని ‘PM Vishwakarma Kaushal Samman Yojana’ విభాగంలో ‘Apply Online’ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు వచ్చే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయి, ఫారమ్‌ను వివరంగా నింపి, అవసరమైన పత్రాలను జత చేసి సబ్మిట్ చేయాలి. ఈ పథకం ప్రారంభమైన మూడేళ్లలో ఇప్పటివరకు 30 లక్షలకు పైగా మంది నమోదు చేసుకోగా, దాదాపు 24.50 లక్షల మంది విశ్వకర్మలకు స్కిల్ ట్రైనింగ్ పూర్తయింది. అంతేకాకుండా, ఆర్టిజన్లు తమ పనితనం, ఉత్పాదకతను పెంచుకోవడానికి వీలుగా ఇండియా పోస్ట్ ద్వారా ఏకంగా రూ.18.15 లక్షల ఆధునిక టూల్కిట్లను నేరుగా వారి ఇళ్లకే ప్రభుత్వం సగర్వంగా అందజేసింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!