Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Accident: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలులోని ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనతో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రమాద ప్రభావంతో నార్త్ సింహాచలం, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి రైల్వే స్టేషన్లలో ట్రాక్‌లు పూర్తిగా నిండిపోయాయి. దువ్వాడ రైల్వే స్టేషన్లో షాలిమార్, చెన్నై వైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. దీంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు 78 బోగీలతో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పారాదీప్ నుంచి ఎరువులను తీసుకుని బారామతికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రైల్వే అధికారులు చేరుకుని సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. కాగా, ఇదే ప్రాంతంలో రెండు వారాల క్రితం కూడా గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన చోటుచేసుకుంది. తాజాగా మరోసారి అదే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో రైల్వే ట్రాక్‌ల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైల్వే అధికారులు మెయింటెనెన్స్‌ను సక్రమంగా నిర్వహించకపోవడమే ప్రమాదాలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read
- Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
తాజావార్తలు
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!