Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma Joins Virat Kohli T20 Centuries List: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. గురువారం రాత్రి ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో విధ్వంసక సెంచరీతో చెలరేగిన అభిషేక్.. తన టీ20 కెరీర్లో పదో శతకాన్ని పూర్తి చేశాడు. దీంతో టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.
అభిషేక్ శర్మ ఇప్పటివరకు టీ20ల్లో 10 సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో మూడు శతకాలు టీమిండియా తరఫున చేయగా.. రెండు సెంచరీలు ఐపీఎల్లో సాధించాడు. మిగిలిన సెంచరీలు ఇతర టీ20 టోర్నీల్లో వచ్చాయి. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా మొత్తంగా 10 టీ20 శతకాలు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు ఐపీఎల్లో, ఒకటి టీమిండియా తరఫున సాధించాడు. అభిషేక్ కేవలం 205 ఇన్నింగ్స్‌ల్లోనే 10 టీ20 సెంచరీలు పూర్తి చేయడం విశేషం. కెరీర్ మొదలెట్టి రెండేళ్లే అయినా అప్పుడే 10 శతకాలు చేయడం విశేషం. అభిషేక్ ఓపెనర్‌గా ఆడుతుండడం అతడికి కలిసొచ్చే అంశం. విరాట్ 2008లో కెరీర్ ఆరంభించినా.. ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత కారణంగా కొన్నిసార్లు దూకుడుగా ఆడడం కుదరదు. అయినా కూడా కింగ్ ఖాతాలో 10 సెంచరీలు అంటే మాటలు కాదు.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 ఫార్మాట్లో పది లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాటర్ల లిస్టులో అభిషేక్ శర్మ చోటు సంపాదించాడు. ఈ ఘనతను ఇంత వేగంగా సాధించిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ మాత్రమే అభిషేక్ కంటే ముందున్నాడు. గేల్ కేవలం 126 ఇన్నింగ్స్‌ల్లోనే 10 టీ20 సెంచరీల మార్క్‌ను అందుకున్నాడు. కాటేరమ్మ కొడుకు ఈ మైలురాయిని 205 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. అభిషేక్ తన దూకుడైన బ్యాటింగ్‌తో తక్కువ సమయంలోనే ఈ మైలురాయిని చేరుకోవడం అతని టీ20 కెరీర్లో ప్రత్యేక ఘనతగా నిలిచింది. ముఖ్యంగా టీ20 క్రికెట్లో సెంచరీ చేయడం అంత సులభం కానప్పటికీ.. అభిషేక్ పవర్ హిట్టింగ్తో వరుసగా భారీ స్కోర్లు సాధిస్తూ ఈ రికార్డు జాబితాలోకి దూసుకొచ్చాడు.
భారత ఆటగాళ్లలో అత్యధిక టీ20 సెంచరీల జాబితాలో ప్రస్తుతం అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ తలో 10 శతకాలతో సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. కేఎల్ రాహుల్, సంజు శాంసన్ చెరో ఎనిమిది టీ20 సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ కూడా ఎనిమిది శతకాలతో ఈ జాబితాలో కొనసాగుతున్నాడు. రాహుల్ చేసిన ఎనిమిది సెంచరీల్లో రెండు టీమిండియా తరఫున, ఆరు ఐపీఎల్లో వచ్చాయి. సంజు ఎనిమిది శతకాల్లో మూడు భారత్ తరఫున, ఐదు ఐపీఎల్లో సాధించాడు. రోహిత్ ఎనిమిది సెంచరీల్లో ఐదు టీమిండియా తరఫున, రెండు ఐపీఎల్లో నమోదు చేశాడు. అఫ్గానిస్థాన్‌పై మూడో టీ20లో అభిషేక్ ఆడిన ఇన్నింగ్స్‌తో ఈ రికార్డులు సాధించడం మరింత ప్రత్యేకంగా మారింది.
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!