Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zombie Reddy 2: తేజ సజ్జ కెరీర్లో ‘హనుమాన్’కు ముందు వచ్చిన ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) ఎంత ప్రత్యేకమైన సినిమానో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ జాంబీ కామెడీకి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2’ (Zombie Reddy 2) నుండి ఈ రోజు (2026 సెప్టెంబర్ 18) కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయన పవర్ఫుల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హై-స్టేక్స్ యాక్షన్-కామెడీ చిత్రంలో ఉపేంద్ర ఒక సరికొత్త వైవిధ్యమైన, మాస్ అండ్ మ్యాడ్నెస్ కలగలిసిన పవర్‌హౌస్ పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. మొదటి భాగం రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగగా, ఈ భారీ సీక్వెల్ కథ మాత్రం పూర్తిస్థాయిలో హైదరాబాద్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో (చార్మినార్ వంటి ఐకానిక్ లొకేషన్లలో) సాగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ షనాయా కపూర్ టాలీవుడ్‌కి హీరోయిన్గా పరిచయమవుతుండగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దీనికి కథ, స్క్రీన్‌ప్లే అందించగా, గౌర హరి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, నేపాలీ, జపనీస్ వంటి భాషల్లో 2027 లో భారీ స్థాయిలో విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తేజ సజ్జ పాత్ర, ఉపేంద్ర రోల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు. దీంతో ఒక్కో అప్డేట్తో ‘జాంబీ రెడ్డి 2’పై క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. మరి తేజ సజ్జ, ఉపేంద్ర కాంబినేషన్లో ఈ సీక్వెల్ ఎలాంటి జాంబీ ప్రపంచాన్ని చూపించబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read
- Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Tags
- cinema
- Zombie Reddy-2
తాజావార్తలు
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!