Karri Padma Shri: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు.. ఇలా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. కొందరు టీడీపీ గూటికి చేరితే.. మరికొందరు జనసేన కండువా కప్పుకున్నారు.. ఇంకా కొందరిది ఎటూ తేలడంలేదు.. ఈ నేపథ్యంలో.. గవర్నర్ ను కలిసే యోచనలో ఉన్నారు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ.. నెలరోజుల కిందట వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు పద్మ శ్రీ.. అయితే, ఇప్పటి వరకు ఆమె రాజీనామాకు ఆమోదముద్రపడలేదు.. తన రాజీనామాపై మండలి చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లే ఆలోచనలో ఆమె ఉన్నారట..
Read Also: Polena Anjana: పవన్ కల్యాణ్ చిన్న కుమార్తెను చూశారా?.. అక్కాచెల్లెళ్ల పిక్స్ వైరల్?
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు పద్మశ్రీ.. తనను గవర్నర్ నామినేట్ చేశారు.. కాబట్టి, ఇష్ట పూర్వకంగానే రాజీనామా చేశానని.. మరొక సారి ఈ విషయాన్ని గవర్నర్ కి తెలపనున్నారట పద్మశ్రీ.. ఇప్పటికే తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ కు రెండోసారి లేఖ రాశారు.. ఇక, తన రాజీనామాను ఆమోదించిన తర్వాత.. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారట కర్రి పద్మశీ.. మరోవైపు, ఇప్పటికే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై.. పార్టీలో చేరికపై చర్చించారట.. ఆమె టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నా.. రాజీనామాకు ఆమోదం లభించకపోవడంతోనే ఇంత కాలం ఆగారట..