కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతోన్న వేళ.. దాడులు వ్యవహారం కాకరేపుతోంది.. అయితే, రాజ్ భవన్‌లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వైసీపీ నేతల బృందం.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో సమావేశం అయ్యారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‌లో గవర్నర్‌తో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. గవర్నర్‌తో భేటీ అనంతరం జగన్ దంపతులు తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను జగన్ దంపతులు కలిశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలే అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ దంపతులు వాకబు…
YS Jagan Governor Meeting: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‌కు వెళ్లి.. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్‌కు వైఎస్ జగన్ వివరించనున్నారు. అలానే కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతల అరాచకాలపై కంప్లైంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. Also Read: Rishabh Pant: దేశం కోసం…
ఏపీలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసుల బనాయింపు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది వైసీపీ ప్రతినిధుల బృందం..
భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు అడుగుపెట్టారు.. ఒడిశా పర్యటన ముగించుకుని విశాఖ చేరుకున్న ప్రధాని మోడీకి ఐఎన్‌ఎస్ డేగా వద్ద స్వాగతం పలికారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్..
శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం ఉంటుంది. ఎమ్మెల్యే కూన రవి కుమార్ సభలో ధన్యవాదాలు తీర్మానాన్ని ప్రవేశపెడతారు.. తర్వాత గవర్నర్ ప్రసంగం పై చర్చ జరుగుతుంది.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల ప్రకటన చేస్తారు సీఎం చంద్రబాబు.. ఇక, శాసన మండలిలో ఏపీ ఎంఆర్డీ సవరణ ఆర్డినెన్స్ మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరుగుతుంది.. శాసన మండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ్యులు ప్రసంగిస్తారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు భద్రతా వైఫల్యంపై రేపు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ నజీర్‌ను.. కలవనుంది వైసీపీ నేతల బృందం. జగన్‌కు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అప్పుల భారం ఎక్కువగా ఉందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారని, ఓ చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నారు. భారీ విజయం కట్టబెట్టిన ప్రజల నమ్మకంను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏపీలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ…
గవర్నర్ ను కలిసే యోచనలో ఉన్నారు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ.. నెలరోజుల కిందట వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు పద్మ శ్రీ.. అయితే, ఇప్పటి వరకు ఆమె రాజీనామాకు ఆమోదముద్రపడలేదు.. తన రాజీనామాపై మండలి చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లే ఆలోచనలో ఆమె ఉన్నారట..
AP Governor: భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని.. ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని గవర్నర్ హెచ్చరించారు.