బెజవాడలో ఆ లీడర్‌కి సీనియారిటీ ఉన్నా... కాలం కలిసి రావడం లేదా? వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు అంటూ... పదిహేనేళ్ళు వెయిట్ చేశాం. ఇక మావల్ల కాదని ఆ నేత అనుచరగణం ఎందుకు అంటోంది?
వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో సమావేశం కాబోతున్నారు.. 11 నెలల తర్వాత నారా లోకేష్, వంగవీటి రాధా భేటీ జరుగుతోన్న నేపథ్యంలో.. విషయం ఏమై ఉంటుంది? అనే చర్చ ఆసక్తికరంగా మారింది.
వంగవీటి మోహన రంగా... ఆయన భౌతికంగా దూరమై దశాబ్దాలు గడుస్తున్నా... ఆ పేరు మాత్రం ఎప్పటికప్పుడు ఏపీ పాలిటిక్స్‌ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే... రకరకాల ఈక్వేషన్స్ వంగవీటి చుట్టూనే తిరుగుతుంటాయి. కులాలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నా... ప్రత్యేకించి కాపులు మాత్రం ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పొలిటికల్ హంగామా కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది.
రెండు విడతలుగా పోటీకి దూరంగా ఉంటున్నా…, పార్టీ కోసమే ప్రచారం చేస్తున్నా….. ఆ సీనియర్ లీడర్‌ని టీడీపీ అధిష్టానం లైట్ తీసుకుంటోందా? ఆయన పార్టీలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన హామీల్ని సైతం మర్చిపోయిందా? అందరికీ పదవులు ఇస్తున్నా… ఆయన్ని మాత్రం ఎందుకు పట్టించుకోలేదు? స్వయంగా చంద్రబాబు ఇచ్చిన హామీ ఎందుకు అమలవడం లేదు? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా ల్యాగింగ్ స్టోరీ? వంగవీటి రాధా…మాజీ ఎమ్మెల్యేగా కంటే దివంగత నాయకుడు వంగవీటి రంగా కుమారుడిగానే ఆయనకు ఎక్కువ గుర్తింపు…
వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాపై వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శలు చేశారు. వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు.. కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారన్నారు. కాపు రిజర్వేషన్ల పైన రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు కానీ.. రంగా ఆశయాల కోసం రాధా ఎక్కడా నిలబడనిలేదన్నారు. రంగా కొడుకు రాధా ఆలోచన తనకు అర్ధం కావడం లేదని, కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా…
ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రోజు అర్థరాత్రి అస్వస్థతకు గురుకావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. స్వల్ప గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరినట్టుగా చెబుతున్నారు.. అయితే, గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్టుగా పేర్కొన్నారు రాధా సన్నిహితులు
ఎన్నికల వేళ.. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. వైసీపీలో అసంతృప్తులంతా ఎవరి దారి వారు చూసుకుంటుంటే.. టికెట్ల ప్రకటన తర్వాత టీడీపీ, జనసేనలో మొదలైన లుకలుకలను ఆయుధంగా మార్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.