తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా.. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది టీటీడీ.. రోజుకు రెండు వేల టికెట్ల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300 దర్శన టికెట్ కొనుగోలు చేయాలి… ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహాలఘు దర్శనం కల్పించనున్నారు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, వైకుంఠ ద్వార దర్శనానికి ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. గతంలో కంటే ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా చర్యలు చేపట్టింది.. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసింది.. అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.. 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి జరగనుండగా.. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ..