K.A. Paul: బెట్టింగ్ యాప్స్‌కి ప్రచారం చేసిన వాళ్లను జైల్లో పెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. తాజాగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసు రెండో కోర్టులో లిస్ట్ అయిందని.. కానీ కోర్టుకు సెలవిచ్చారన్నారు. నాకు ఎక్కడ పేరు వస్తుందో అని, కోర్టుకు సెలవు ఇస్తున్నారన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్లకు న్యాయం జరగాలన్నారు. బెట్టింగ్ యాప్స్ పై సీబీఐ విచారణ జరగాలన్నారు. సుప్రీంకోర్టులో బెట్టింగ్ ఆప్స్ కేసు…
కరూర్ తొక్కిసలాట ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ టీవీకే అధినేత, నటుడు విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీం ధర్మాసనం కీలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కాళేశ్వరం అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బిఆర్ఎస్ కూలింది.
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ బూటకపు విచారణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోణాన్ని తప్పుగా మలుపు తిప్పుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నప్పటికీ వారిని మాత్రం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యాంశం.. మాజీ సీఎం…
Tamilnadu: 27 ఏళ్ల ఆలయ గార్డు కస్టడీలో మరణించిన ఘటన తమిళనాడును కుదిపేస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలకు కారణమయ్యాయి. ఇదిలా ఉంటే, కస్టడీలో ఒక వ్యక్తి చనిపోవడంపై మద్రాస్ హైకోర్టు విచారించింది. హైకోర్టు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. జూన్ 27న ఒక ఆలయం నుంచి ఆభరణాలను దొంగలించాడనే కేసులో అరెస్ట్ కాబడిన అజిత్ కుమార్‌పై ‘‘ అధికార మత్తులో ఉన్న పోలీసులు’’ దారుణంగా దాడి…
తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పోలీస్ కస్టడీలో ఆలయ గార్డు అజిత్ కుమార్ మరణించిడంపై పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతోంది. డీఎంకే పాలనలో లాకప్ డెత్‌లకు రాష్ట్రం మాతృభూమిగా మారిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
భర్త రాజా రఘువంశీని ప్రియుడు రాజ్ కుష్వాహా సహకారంతో సోనమ్ చంపేసిందని పోలీసులు వెల్లడించారు. మే 11న రాజా రఘువంశీ-సోనమ్‌కి వివాహం జరిగింది. మే 20న మేఘాలయ హనీమూన్‌కు వెళ్లి మే 23న అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యం అయింది.
రాజా రఘువంశీ-సోనమ్‌కు మే 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వివాహం జరిగిందని.. ఆ సమయంలో అంతా సాధారణంగానే ఉందని రాజా సోదరుడు సచిన్ తెలిపారు. పెళ్లికి ముందు కూడా సోనమ్ కుటుంబంతో కలిసే షాపింగ్ చేసినట్లు వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన జంట రాజా రఘువంశీ-సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైంది. కొన్ని రోజుల తర్వాత రాజా శవమై కనిపించగా.. తాజాగా అతడి భార్య పోలీసులకు చిక్కింది. భార్యనే కిరాయి ముఠాతో భర్తను చంపించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా మేఘాలయ ముఖ్యమంత్రి, డీజీపీ కూడా స్పష్టం చేశారు.
భర్త రాజా రఘువంశీని సోనమ్ చంపినట్లు వస్తున్న వార్తలను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టు కథలు సృష్టిస్తోందని.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె సోనమ్‌కు ఏ పాపం తెలియదని తండ్రి దేవి సింగ్ మీడియాతో వాపోయాడు.