వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన కూతరు సునీతరెడ్డి.. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టు జారీ చేసిన బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. అంతేకాకుండా వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మరో పిటిషన్ వేసింది సీబీఐ.. ఇక, సునీత రెడ్డి, సీబీఐ పిటిషనల్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. మరోవైపు తదుపరి…
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డర్టీ గేమ్ ఆడుతుంది.. అది ఆ పార్టీ సంప్రదాయంగా చూస్తున్నాం అని దుయ్యబట్టారు సీఎం జగన్. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు.. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని మండిపడ్డారు. నేను కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్న (వైఎస్ వివేకానందరెడ్డి)కు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు.. అయినా చరిత్ర నుంచి వారు పాఠాలు నేర్వేలేదు.. ఇప్పుడు ఆ పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరి (వైఎస్…
సుప్రీంకోర్టులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందుస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకునే హక్కు అవినాష్ రెడ్డికి ఉందని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కొంతకాలంగా బెయిల్‌పై బయట ఉన్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు.
YS Sunitha Reddy: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు చూపిస్తోంది.. విచారణ కీలక దశకు చేరుకుంది.. అయితే, ఈ సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి.. పొలిటికల్ ఎంట్రీపై ఓ పోస్టర్ కలకలం రేపుతోంది.. కడప జిల్లా ప్రొద్దుటూరులో తాజాగా వేసిన పోస్టర్ల కలకలం సృష్టిస్తున్నాయి.. వైఎస్ సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ రాత్రికి రాత్రే పట్టణంలో వాల్ పోస్టర్ల అతికించారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించనుంది సీబీఐ. ఇవాళ్టి నుంచి ఆరురోజులపాటు విచారించనుంది. ఈనెల 24 వరకు ఆయన్ని ప్రశ్నించనుంది సీబీఐ టీమ్.. అయితే, ఈ నెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించింది ఇప్పటికే తెలంగాణ హైకోర్టు. అప్పటి వరకు ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అవినాష్ రెడ్డి విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని తెల్పింది. విచారణ సమయంలో ప్రశ్నలను లిఖితపూర్వకంగానే…
YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.. తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది.. వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు.. అయితే, నిందితుడిగా ఉన్న దస్తగిరిని అప్రూవర్ గా మార్చడంపై వైఎస్ భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా…
Supreme Court: వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీకోర్టు సీరియస్ అయింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది. విచారణపై తాజా పరిస్థితిని సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదని సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికార ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించకపోతే వేరే దర్యాపు అధికారిని ఎందుకు నియమించకూడదని వ్యాఖ్యానించింది.