CM Chandrababu: మాజీ మంత్రి వివేకా హత్యకేసు మరోసారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సీఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులివ్వడం పోలీసుశాఖలో కలకలం రేపింది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామం ఎన్నడూ జరగలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేటితో విచారణ ముగియనుంది.. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది.. మరి కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా? లేదా సుప్రీంకోర్టును మరింత గడువు కోరనున్నారా? అనే ఉత్కంఠ నెలకొంది.
Ram Gopal Varma:వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచలనాలకు పర్మినెంట్ అడ్రెస్స్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే.. ఏం చేసినా వివాదమే. సినిమాలు, రాజకీయాలల్లో వర్మ వేలు పెట్టడం సర్వ సాధారణమే. ఆయనకు నచ్చని విషయం ఏదైనా ఉన్నా..
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగానే.. మరోవైపు కోర్టులో కూడా విచారణ సాగుతోంది.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారామె.. అయితే, ఈ కేసు రేపు విచారించనుంది…
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేటి సీబీఐ విచారణ రేపటికి ( మంగళవారం ) వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
Supreme Court: వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీకోర్టు సీరియస్ అయింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది. విచారణపై తాజా పరిస్థితిని సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదని సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికార ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించకపోతే వేరే దర్యాపు అధికారిని ఎందుకు నియమించకూడదని వ్యాఖ్యానించింది.
మాజీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఆదివారం సీబీఐ విచారించనుంది.
అమరావతి: టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో ఏపీ సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారి ఎవరో తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేకా హత్య కేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యను గతంలో తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని.. బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనమయ్యారని విమర్శించారు. వివేకా…