Tirumala: మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలు.. భక్తులకు నో టెన్షన్.. !
- అటవీప్రాంతాల్లో వన్యప్రాణుల పర్యవేక్షణకు కీలక నిర్ణయం..
- తిరుపతి, తిరుమలలో నిరంతరం చిరుతపులుల సంచారం..
- వాటిపై ఫోకస్ పెట్టిన ఫారెస్ట్ డిపార్టుమెంట్..
- తిరుమలకు వెళ్లే మెట్లమార్గంలో 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: శేషాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం. అయితే, అంతేస్థాయిలో అక్కడ వన్య ప్రాణులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఏనుగులు, ఇతర వైల్డ్ లైఫ్ కూడా చాలానే ఉంది. వాటిబారి నుంచి మనుషులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అటవీశాఖ టెక్నాలజీ పరంగా కొన్ని విప్లవాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా అటవీప్రాంతాల్లో వన్యప్రాణుల పర్యవేక్షణకు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, తిరుమలలో నిరంతరం చిరుతపులులు సంచరిస్తున్నాయి. అందుకే.. అవి ఎన్ని ఉన్నాయి… ఎక్కడెడక్కడ తిరుగుతుంటాయి అనే విషయాలపై ఫారెస్ట్ డిపార్టుమెంట్ దృష్టి పెట్టింది. వాటితో పాటు ఇతర జంతువుల సంచారాన్ని అంచనా వేసేలా చర్యలు తీసుకుంది.
Read Also: KCR: ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం.. విజ్ఞాలు తొలగాలని పూజలు
Also Read
అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్లమార్గంలో 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో 30కిపైగా సోలార్ పవర్ లైవ్ స్ట్రీమింగ్ కెమెరాలున్నాయి. వాటితో పాటు AI ఆధారిత పర్యవేక్షణ, ప్రిడిక్టివ్ అనాలిసిస్.. డ్రోన్ నిఘా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక, ఏర్పాటు చేసిన టెక్నాలజీ సత్ఫలితాలిస్తోంది. శేషచల అటవీప్రాంతం లోపల అటవీశాఖ చిరుత పులుల సంచారాన్ని గుర్తించింది. కెమెరాలలో ఎనుగులు గుంపు దృశ్యాలు రికార్డయ్యాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య డివిజన్లలో డే అండ్ నైట్ పర్యవేక్షణ, డ్రోన్లు, GPS, గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఏనుగుల కదలికల అంచనా వేస్తున్నారు. ఏనుగు దాడులను అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో స్మార్ట్ ఫెన్సింగ్, SMS హెచ్చరికలు పంపేలా చర్యలు చేపట్టారు. 24 గంటల పర్యవేక్షణ సెల్ బయోలాబ్ ద్వారా ఏనుగుల డేటా సేకరిస్తున్నారు. కమ్యూనికేషన్.. హెచ్చరికలు.. వాట్సాప్, లౌడ్‌స్పీకర్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. తాజా లెక్కలు ప్రకారం తిరుపతి డివిజన్లో 40కిపైగా ఏనుగులు ఉన్నట్లుగా గుర్తించారు. ట్రాప్ కెమెరాలో చిరుతపులి వీడియోలు రికార్డయ్యాయి. డ్రోన్ కెమెరా, ట్రాప్ కెమెరాల్లోనూ ఏనుగులు సంచరిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
తాజావార్తలు
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!