Real Estate Scam: శ్రీవారి వీవీఐపీ దర్శనం పేరుతో రియల్ ఎస్టేట్ మోసం?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Real Estate Scam: తిరుమల శ్రీవారి వీవీఐపీ దర్శనాన్ని ఎరగా చూపిస్తూ ప్లాట్ల విక్రయాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సీపీ డెవలపర్స్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంస్థ ప్రతినిధులు కాల్ సెంటర్ ద్వారా కొనుగోలుదారులను సంప్రదిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో ఒప్పందం చేసుకున్నామని, తమ వద్ద ప్లాట్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం వీవీఐపీ దర్శనం కల్పిస్తామని ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ వ్యవహారంలో ఒక ఫేక్ ఫోన్ నంబర్ వెలుగులోకి రాగా, తాజాగా మరో కొత్త నంబర్ నుంచి కూడా భవిష్యత్ కొనుగోలుదారులకు ఫోన్లు వస్తున్నట్లు బయటపడింది. దీంతో ఈ ప్రచారం వెనుక మరింత పెద్ద మోసపూరిత నెట్వర్క్ పనిచేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, శ్రీవారి దర్శనం పేరుతో జరుగుతున్న ఈ ప్రచారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి హామీలు ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి, పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి వాస్తవాలను వెలికితీయాలని కోరుతున్నారు.
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
అలాగే టీటీడీ పేరును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ఫేక్ రియల్ ఎస్టేట్ సంస్థలు, సైబర్ కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో లేదా ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే “జీవితాంతం వీవీఐపీ దర్శనం”, “టీటీడీతో ప్రత్యేక ఒప్పందం” వంటి ప్రకటనలను నమ్మి ఎవరూ డబ్బులు చెల్లించవద్దని హెచ్చరిస్తున్నారు. భక్తిని ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ సందేహం వచ్చినా అధికారిక టీటీడీ సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని నిపుణులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!