శేషాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం. అయితే, అంతేస్థాయిలో అక్కడ వన్య ప్రాణులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఏనుగులు, ఇతర వైల్డ్ లైఫ్ కూడా చాలానే ఉంది. వాటిబారి నుంచి మనుషులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అటవీశాఖ టెక్నాలజీ పరంగా కొన్ని విప్లవాత్మక అడుగులు వేస్తోంది.
తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుతలు అలజడి సృష్టిస్తున్నాయి.. గతంలో భక్తులపై దాడి, ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉండడంతో టీటీడీ అప్రమత్తమైంది.. నిపుణులతో సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు... అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రతకు అదనపు సిబ్బంది కేటాయించాలని నిర్ణయించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని.. టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడకమార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్…