ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సతీమణి శోభతో కలిసి మద్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ పూజలో పాల్గొననున్నారు. ప్రతి ఏటా వినాయకచవితి నవరాత్రులలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజ్ఞాలు తొలగాలని కేసీఆర్ పూజలు చేయనున్నారు. ఐదు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్ లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ కు పలువురు బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు.
Also Read:PVN Madhav: మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులే కొనాలి.. మళ్లీ స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలి..
కొన్ని రోజుల క్రితం కల్వకుంట్ల కవిత హరీష్ రావు, సంతోష్ లపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. హరీష్ కారణంగానే కేసీఆర్ బద్నాం అవుతున్నారని.. ఆయన అవినీతికి పాల్పడ్డాడని విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారం హాట్ టాపిక్ గా మారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.