శేషాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం. అయితే, అంతేస్థాయిలో అక్కడ వన్య ప్రాణులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఏనుగులు, ఇతర వైల్డ్ లైఫ్ కూడా చాలానే ఉంది. వాటిబారి నుంచి మనుషులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అటవీశాఖ టెక్నాలజీ పరంగా కొన్ని విప్లవాత్మక అడుగులు వేస్తోంది.