తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో మే నెల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అందులో మొదటగా.. రేపు ఉదయం అనగా ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి.