విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ఛావా. చత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచాలా సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారైతే సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు.
NTPC Recruitment 2025: కేంద్ర విద్యుత్ సంస్థలో భారీగా జాబ్స్.. నెలకు రూ.55 వేల జీతం
హిందూత్వవాదులతో పాటు శివాజీ అభిమానులు సైతం సినిమాకి నిరాజనాలు పడుతున్నారు. దీంతో ఛావా సినిమా రోజురోజుకు క్రేజ్ పెంచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యంగా సినిమా చూసిన తర్వాత వచ్చిన గూజ్ బంప్స్ మూమెంట్స్ ని ప్రేక్షకులు వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని దినేష్ విజన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మొఘలులకు, చత్రపతి సంభాజీ మహారాజ్ కు జరిగిన యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడంతో సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.