అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో గత వారం ఓ బాలింతను కుటుంబ సభ్యులు ప్రమాదకర పరిస్థితుల్లో భుజంపై మోసుకెళ్లిన ఘటన అందరినీ కలిచి వేసింది. బాలింతను కుటుంబ సభ్యులు పెద్దేరువాగు దాటించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో.. బాలింత కష్టంపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో సంధ్యారాణి మాట్లాడారు.
Read Also: Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మద్యం షాపులు మూత.. 10 రోజులు పస్తులేనా..?
వాగు దాటేందుకు బాలింతలు పడుతున్న కష్టాలను చూసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి చలించిపోయారు. బాలింతలు వాగు దాటేందుకు.. రోప్ వే బ్రిడ్జిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంజూరు చేయించారు. రూ. 70 లక్షలతో అధికారులు ఎస్టిమేషన్ వేశారు. వర్షాలు తగ్గాక త్వరలో రోప్ వే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే శిరీష దేవి చొరవతో రోప్ వే బ్రిడ్జి మంజూరు కావడం పట్ల గిరిజనులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Komatireddy Venkat Reddy: మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే ప్రత్యేక ఉద్యమం చేస్తాం..