తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో గత వారం ఓ బాలింతను కుటుంబ సభ్యులు ప్రమాదకర పరిస్థితుల్లో భుజంపై మోసుకెళ్లిన ఘటన అందరినీ కలిచి వేసింది. బాలింతను కుటుంబ సభ్యులు పెద్దేరువాగు దాటించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో.. బాలింత కష్టంపై ప్రభుత్వం స్పందించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా వున్నా.. అడవులు, కొండలు, గుట్టలు ఎక్కువగా వుండే ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం కష్టంగా నడుస్తోంది. పల్లె ప్రగతి కోసం వెళ్ళిన అధికారులకు రోడు కష్టాలు కళ్ళకు కట్టాయి. వారంతా నడవలేక, కొండలు దాటలేక నానా కష్టాలు పడాల్సి వచ్చింది. మారు మూల ఏజెన్సీ ప్రాంతాలోని గుట్ట లెక్కి మరీ కార్యక్రమం నిర్వహించారు. బండ రాళ్ళు, కొండ గుట్టల మధ్య నుండి గ్రామానికి…
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక భూపతిపాలెం ప్రాజెక్టులోకి తెల్లవారుజామున ప్రమాదవశాత్తు దూసుకు వెళ్ళిందో స్కార్పియో వాహనం. ఈవాహనంలో సుమారు 350 కేజీల గంజాయి తరలిస్తూ పోలీసులు వెంబడించడంతో నిందితులు పారిపోయే ప్రయత్నంలో ఈఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం సరిహద్దుల నుంచి మారేడుమిల్లి మీదుగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి వాహనాన్ని వెంబడించారు పోలీసులు. భూపతిపాలెం వద్ద జరిగిన ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొనగా, మరొక వ్యక్తి పరారయ్యాడు. ప్రాజెక్టు కాలువలోకి దూసుకెళ్లిన వాహనాన్ని…
చేపల వేటకు వెళ్లి నలుగురు మృతి చెందిన ఘటన విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి మండలం చాపరాజు పాలెంలో చోటుచేసు కుంది. చేపల వేట నిమిత్తం సమీపంలోని బొంతు వలస గడ్డవద్దకు వెళ్లిన గిరిజనులు ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయారు. మృతి చెందిన వారిని జీకే వీధి మండలంలోని చాప రాజు పాలెం గ్రామనికి చెందిన గడుతూరి నూకరాజు (35) గడుతూరి తులసి (9) గడుతూరి లాస్య (10) రమణబాబుగా గుర్తించారు. ముగ్గురు మృతదేహలు లభించాయి. రమణబాబు…
విశాఖ మన్యంలో రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు సామాన్య గిరిజనులు. ఇక గర్భిణీల బాధలు అన్నీ ఇన్నీ కావు. పురిటి నొప్పులతో నిండు గర్భవతి పాపకు జన్మనిచ్చి తిరిగిరాని లోకాలకు చేరింది. ఆ గిరిజన మహిళ మృతి చెందడంతో ఆ చిన్నారితో మరో ముగ్గురు పిల్లలు తల్లిలేని వారయ్యారు. అంబులెన్స్‌కి ఫోన్ చేసిన రహదారి లేని కారణంతో అది రాలేదు. దీంతో ఆ గర్భిణీ నరకయాతన అనుభవించింది. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం…