అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆరోపించారు. పగటిపూట రాంబాబు, రాత్రులు కాంబాబు అయిన అంబటికి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అని అడిగారు. అబ్బయ్య చౌదరి పేరుకి సాఫ్ట్ వేర్, మనిషి హార్డ్వేర్ అంటూ మండిపడ్డారు. అలాంటి క్రిమినల్ అయిన అబ్బయ్య చౌదరికి అంబటి వత్తాసు ఏంటి? అని క్వశ్చన్ చేశారు.
దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల పెదవేగి పోలీస్ స్టేషన్‌లో చేసిన హల్‌చల్‌తో చింతమనేని ప్రభాకర్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెదవేగి పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమతో పాటు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తీసుకెళ్లారు.
Vallabhaneni Vamsi Mohan: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చింతమనేని వ్యాఖ్యలపై స్పందించారు.. ముందు వాడి ఊరిలో వాడిని చూసుకోమనండి.. బకెట్ జారిన.. అడుగు జారిన యదవలంతా నానికి, నాకు చెబుతున్నారు.. మంగమ్మ శపథాలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి నలుగురు విభేదించిన టీడీపీ వెంటిలేటర్ మీద ఉందా? లేక…
Chintamaneni Prabhakar: పోలీసుల తీరుపట్ల టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 3న తన పుట్టినరోజు సందర్భంగా ఏలూరు రక్తదాన శిబిరం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు చింతమనేని ప్రభాకర్ వెళ్లగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తన చొక్కా చింపివేశారని ప్రెస్‌మీట్‌లోనే చింతమనేని ప్రభాకర్ తన చొక్కా విప్పి చూపించారు. అత్యుత్సాహంతో తన చొక్కా చింపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చింతమనేని హెచ్చరించారు. ఇప్పటికే తనపై 31…
2019 అసెంబ్లీ ఎన్నికలు దెందులూరు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. తనకు ఎదురే లేదని అనుకున్న టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఓడిపోగా.. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొఠారు అబ్బయ్య చౌదరి గెలిచారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో.. సీన్ మారిపోయింది. దెందులూరులో పొలిటికల్ గేమ్ కూడా ఆ స్థాయిలో రక్తికట్టిందనే చెప్పాలి. ఇప్పటికీ నియోజకవర్గంలో నేతల మధ్య రాజకీయ చదరంగం నడుస్తోంది. అయితే, గత ఎన్నికల్లో ఓడినా దూకుడు తగ్గించని…
Chintamaneni Prabhakar: అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర తాడేపల్లి గూడెం చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో కొన్ని ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. అమరావతి టు అరసవెల్లి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఫేక్ రైతులు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే ఈ ఫ్లెక్సీలను స్థానిక మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఏర్పాటు చేయించారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవగాహన లేమితో రాజధానిపై మూడు…
పఠాన్‌చెరు కోడిపందాల కేసు తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రియాక్షన్ ఇది. తొలుత కోడిపందాలు జరిగిన ప్రదేశంలోనే లేనని చెప్పిన ఆయన.. పోలీసులు వీడియోలు రిలీజ్ చేశాక టోన్ మార్చేశారు. కోడిపందాలకు.. తనకు ఉన్న అవినాభావ సంబంధాన్ని స్వయంగా వెల్లడించారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. తన వీక్ నెస్‌ను అడ్డంగా పెట్టుకుని తనపై స్కెచ్ వేశారని చింతమనేని చెప్పడంతో చర్చ దానిపైకి మళ్లింది. పైగా కోడి పందాల వద్ద పోలీసులే తనకు…