Taneti Vanitha 10 Lakhs Financial Help To Minor Girl Family Members: కృష్ణా జిల్లా పామర్రు మండలం నిబానుపూడిలో అత్యాచారానికి గురై, మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబ సభ్యుల్ని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, కలెక్టర్ రాజాబాబు పరామర్శించారు. బాధిత కుటుంబానికి మనో ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మైనర్ బాలిక అత్యాచారం గురై మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికీ రాకూడదన్నారు.
YadammaRaju: జబర్దస్త్ నటుడికి యాక్సిడెంట్.. భార్య చేసిన పనికి బూతులు తిడుతున్న నెటిజన్స్
దుర్మార్గంగా అత్యాచారం చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని.. ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తానేటి వనిత చెప్పారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్.. తక్షణమే స్పందించారన్నారు. ఇలాంటి దారుణ ఘటనలు ఎక్కడా జరగకూడదని ఆకాంక్షించారు. దురదృష్టవశాత్తు జరిగితే.. జగన్ సర్కార్ వెంటనే స్పందిస్తుందని హామీ ఇచ్చారు. ఇలాంటి బాధాకర విషయాలపై కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఏ కుటుంబంలో ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగకూడదని అన్నారు. నిందితులకు యావజ్జివ కారాగార శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే.. బాధిత కుటుంబానికి స్థానిక వైసీపీ నాయకత్వం అన్నివేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ భరోసా ఇచ్చారు.
Iris Ibrahim: ఆమెకి 83, అతనికి 37.. పెళ్లైన రెండేళ్ల తర్వాత షాకింగ్ ట్విస్ట్
కాగా.. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ మైనర్ బాలిక ఈనెల 20వ తేదీన స్కూల్‌కి వెళ్లింది. అయితే.. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల తర్వాత ఓ కాల్వలో బాలిక మృతదేహం కనిపించింది. దీంతో కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. చిల్లిముంత లోకేష్, లంకా నరేంద్ర, రాజేష్‌లను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ఆ యువతిని ఒక లాడ్జికి తీసుకెళ్లి, అక్కడ అత్యాచారం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసును పకడ్బందీగా పరిశీలన చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.