YadammaRaju: జబర్దస్త్ నటుడు యాదమ్మ రాజు గురించి అందరికి తెల్సిందే. తనదైన యాసతో అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఇక జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్న యాదమ్మ రాజుకు యాక్సిడెంట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ విషయాన్నీ అతని భార్య స్టెల్లా సోషల్ మీడియాద్వారా తెలిపింది. యాదమ్మ రాజుకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. కాలు విరిగింది.. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులందరికి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది. హాస్పిటల్ లో యాదమ్మరాజు చికిత్స పొందుతున్నాడు. కాలు విరిగినట్లు తెలుస్తోంది.
Jawan: డెత్ కు డీలర్.. అదిరిపోయిన విజయ్ సేతుపతి లుక్
ఇక ఈ వీడియో చూసిన అభిమానులు యాదమ్మ రాజు త్వరగా కోలుకోవాలని కోరుతుండగా .. మరికొందరు స్టెల్లా చేసిన పనికి బూతులు తిడుతున్నారు. మొదటి నుంచి కూడా స్టెల్లా, యాదమ్మ రాజు రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన విషయం తెల్సిందే. అయితే భర్త హాస్పిటల్ లో ఉన్నా కూడా ఆమె రీల్స్ చేయడం.. దాన్ని కూడా లైక్స్ కోసం వాడుకోవడంతో కొంతమంది అభిమానులు ఆమెను బూతులు తిడుతున్నారు. ఈ సమయంలో కూడా అతనితో రీల్స్ చేయడం అవసరమా.. ? ఇలాంటి సీరియస్ విషయాన్ని కూడా రీల్స్ చేసి చెప్పాలా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఈ మధ్యనే ఈ జంట విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఒక షో కోసం వీరిద్దరూ విడిపోతున్నట్లు నటించడంతో చాలామంది వారు నిజంగానే విడిపోతున్నారని ప్రచారం జరిగింది. అందులో ఎలాంటి నిజం లేదని, అది కేవలం షో కోసమే చేశామని ఈ జంట క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు చెక్ పడింది.