రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి పది రోజులుగా ఆమె అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. రాజస్తాన్‌కు చెందిన 13 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.…