Iris Ibrahim: ఆమెకి 83, అతనికి 37.. పెళ్లైన రెండేళ్ల తర్వాత షాకింగ్ ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iris Jones And Mohammad Ibrahim Took Divorce After 2 Years Of Marriage: సాధారణంగా పెళ్లి చేసుకునే వరుడు, వధువు మధ్య వయసు వ్యత్యాసం ఎంతుంటుంది? 1 నుంచి 5 సంవత్సరాలు అనేది యావరేజ్ వ్యత్యాసం. కొందరు పదేళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ.. ఎలాంటి అభ్యంతరం లేకుండా పెళ్లి చేసుకుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రియాంక, నిక్ జోనస్ జంటే! కానీ.. 46 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న జంటని మీరెప్పుడైనా చూశారా? మీకు నమ్మశక్యంగా లేకపోయినా.. అలాంటి జంట ఒకటుంది. ఇదే పెద్ద షాకింగ్ న్యూస్ అనుకుంటే, తాజాగా ఈ జంట అంతకుమించిన మరో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. పెళ్లైన రెండేళ్ల తర్వాత వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Jailer vs Jailer: రజనీకాంత్ జైలర్‌కి పోటీగా మరో జైలర్.. ఇదెక్కడి ట్విస్ట్ మావా?
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
2019లో ఐరిస్ జోన్స్ అనే 83 ఏళ్ల బ్రిటీష్ మహిళకు ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌లో 37 ఏళ్ల మహ్మద్ ఇబ్రహీమ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫేస్‌బుక్‌లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం.. కొన్ని రోజుల్లోనే స్నేహంగానే మారింది. ఇబ్రహీంపై తనకు ఫీలింగ్స్ రావడంతో.. 2019 నవంబర్‌లో ఐరిస్ ఈజిప్ట్ రాజధాని కైరోకి వచ్చింది. అక్కడే ఇబ్రహీంని కలిసింది. ఇద్దరూ ఒకరికొకరు ఆకర్షితులు కావడంతో.. ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్ నగరంలో హనీమూన్ కూడా జరుపుకున్నారు. వీళ్లు తమ పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నప్పుడు.. నెట్టింట్లో టాక్ ఆఫ్ ది కపుల్‌గా నిలిచారు. ఎందుకంటే.. వీరి మధ్య ఉన్న 46 ఏళ్ల వయసు వ్యత్యాసమే కారణం. పైగా వీళ్లు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం షేర్ చేసుకుంటూ.. నిత్యం వార్తల్లో నిలిచేవారు.
Karumuri Nageswara Rao: పెళ్ళికి, పేరంటానికి తేడా తెలియని వ్యక్తి పవన్.. మంత్రి కారుమూరి ధ్వజం
ఐరిస్, ఇబ్రహీంల దాంపత్య జీవితం రెండేళ్ల వరకు సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ షాకింగ్ విషయాన్ని ఐరిస్ తాజాగా పంచుకుంది. తనకు ఇబ్రహీం అంటే చాలా ఇష్టమని, అతనికి సంబంధించి ప్రతీదీ తాను ఇష్టపడతానని పేర్కొంది. కానీ.. కొంతకాలం నుంచి తమ బంధం కష్టంగా మారిందని.. తాము ప్రేమలో ఉన్నప్పటికీ ఏదో ఒక విషయంపై గొడవలు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. దీంతో.. విడిపోవడమే మంచిదని భావించి, తాము విడాకులు తీసుకున్నామని కుండబద్దలు కొట్టింది. ఈ బాధ నుంచి కోలుకోవడం కోసం తాను పిల్లిని పెంచుకుంటున్నానని చెప్పింది. తాను మొదటి భర్తతో 1993లో విడాకులు తీసుకున్నానని.. 26 ఏళ్లుగా అతనితో టచ్‌లో లేనని కూడా వెల్లడించింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!